పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/133

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యముపంచ స్తవములు జదుపుచు
పంచేంద్రియ విషయదూరుఁ బంచాస్యు శివున్
పంచాశుగహర హరునిన్
బంచ బ్రహ్మస్వరూపుఁ బ్రస్తుతిఁ జేయున్ . 64

విశ్వవందిత, విశ్వాత్మ, విశ్వనాథ
విశ్వపాలక, విశ్వాఢ్య , విశ్వవినుత
దేవకోటీశ కోటీశదివ్యలింగ
యి మ్మహోపద్రవము బాపి యిపుడె బ్రోవు.65

అని చింతింపఁగ భక్తపుంగవున కాయాసంబు బుట్టించె నీ
ఘన వర్షొద్ధతియంచు నెంచి మదిలోఁ గారుణ్య మేపారఁ జ
య్యన వారించెఁ దటిల్లతాభయదగర్జారావు సంపాతయు
గ్ఘన సంఘాతము చంద్రశేఖరుఁడు భక్తానంద సంధాయియై.66

ఘనతరోద్ధాన మడఁగిన గానిపించు
పరమహంస స్వరూప విస్ఫురణ భంగి
ఘన తరోద్ధాన మడఁగిన గానిపించె
బరమహంస స్వరూప విస్ఫురణ మంత. 67

అప్పుడు గుహాంతరాళంబు వెల్వడి దశదిశావలోకనంబు నేసి, యమ్మహో త్పాతంబు కోటీశ్వరానుగ్రహంబునం బాసెగదా యవి దేవు జూడం జను'నెడ నడుమ నిర్ఝరనిర్ఘాత ప్రభిన్న కుట్టిమ స్థలంబున నతి స్థూలంబగు నొక్క నిధానకలశం బీక్షించి యది శివాజ్ఞాగతంబని యెఱింగి తమ్ములుం దానును దాని నతిప్రయత్నంబువ నిజగుహాంతరంబునకుం జేర్చి దానివలన దినదిన ప్రవర్ధమాన మహైశ్వర్యవిభవుండై యఖండ మహిమానుభావంబున జంగ మార్చనలు సేయుచు శివజ్ఞాన సంపన్నులగు మహాత్ములవలన శివపురాణ శ్రవణంబు వేయుచు నిత్యంబును గోటీశ్వరారాధనం బొనర్చుచు, కాలంబు