పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


ఇట్లు ఘర్మకాలంబున నిర్మల చేతస్కుండై దుర్మలిన వినాకనియగు శంభు పూజ సత్కర్మ నిరతుండై చేయుచుండే నంత.53

కర్షకజన సంతతికిని
హర్షం బొదవంగ ప్రకటితాద్భుత లీలా
కర్షణమై సుకరంబగు
వర్షఋతువు వచ్చెఁ బథిక వర్గము బెగడన్ 54 .

కఠిన రవిరశ్మితప్త లోకంబునకును
తాప మణఁగింప నాఘనతతులుపూని
కఠిన జనతాభితప్త లోకంబునకును
తాప మణఁగింపవే ఘనతతులు జగతి. 55

అట్లు కాదంబినీ ప్రకాండం బకాండ విలయ జలధిపోలిక నదీనదంబు లేకంబు నేయుచు బ్రవర్షించు కాలంబున గిరిఝరి ప్రాంత కాంత కాంతా రంబుల సరిత్సరోవర తీరంబులం దిరుగుచు సాలంకుండు నిర్విశంకుండై కదంబ వాటికా కుసుమ కదంబంబుల దండలు గట్టి కోటీశ్వర శిరోభాగం బనం జుట్టి పాటల రుచిరుచిర జటాజూట కోటరంబగు సదాశివమూర్తి నలంకరింపంజేసి పూజింపుచుండు సమయంబున.56

ఉత్సాహవృత్తము :

వారిదంబు లభ్రమం దవారితంబులై మరు
త్ప్రేరితంబులై యుగాంత భీమనీరదచ్చటా
స్ఫారితంబులై మసారసార నీలిమ ప్రభా
పూరితంబులై ధరాగ్రభూమి జేరె నుద్ధతిన్.

స్రగ్గర

శుంభర్గంభీరగర్జాస్ఫురణయు చపలా శోభయున్ దిక్తటంబుల్
కుంభింపన్ సంభృతాంభః కులికములగుచున్ గుంభినీవ్యాప్తలీలా