శృంగార వృత్తపద్యాల శతకము
125
ఉ॥యౌవ్వని కోమలాంగి మరి యెవ్వనితామణి నిన్నుఁజూడరా|
ద వ్వని పోదు నీవలపు దవ్వనిపొట్టిఁక లేదు ముగ్దవా |
క్రువ్వని కాంత టీని మెడఁగ్రువ్వని పేరుగఁదాల్చు మెప్పుడుం|
ద్రెవ్వని బాంధవంబు లెడత్రెవ్వని దేఁటికి వేంకటేశ్వరా||37||
ఉ॥పొత్తుల పాపఁడా మరుఁడు పొత్తుల మిమ్ముఁ గరంచుబోదునే|
నెత్తులు వెట్ట నీవలవు లెత్తుల పోలిక నున్న వెంచు మీ|
దెత్తు ల కాంత గంధి మొగమెత్తు లలాట మృగీమదంబు దా|
జొత్తులుగా గరంగెవొళ్ళ జొత్తుల నాడుము వేంకటేశ్వరా||38||
ఉ॥మదమున నాకె పాదముల మట్టితి విట్టి తెరంగులేల స|
మ్మదముగఁ జేసి కూడినను మంచిది పొంచి యెరుంగనట్లు స|
య్యదము సుఁగంట నేమిటికి నర్మిలి పేర్మిని నాఁట దానికి౯|
ముదము దలిర్పకున్న రతి మోహనమంటునే వేంక టేశ్వరా||39||
ఉ॥కారులు వల్కి నిన్నుఁ దొలుకారు మెరుంగలవంటి కామినుల్|
కేరుచుమారి ముందు దమకే రుచులెప్పుడుఁ కోరువారిలోఁ|
జేరి కె సేసి కూరుచ కుచేరి కరంబులనంటి మమ్ము నీ|
వారము చిత్తగించి ప్రతివారము నేలుము వేంకటేశ్వరా||40||
ఉ॥ఆఱడిబెట్టి నాపదము లంగనఁ రాఁకెనటంచు నూర కే|
గోఱడి సేసి కౌఁగిటనుఁ గ్రుచ్చెదవాకెను వేడుకయ్యెనో
పేఱడియౌ నుపాయమిది ప్రేమనటింపగ సందు గల్గెనే|
వీఱిడిఁగాను నీసతికి వేగమె మ్రొక్కగ వేంకటేశ్వరా||41||
ఉ॥చాయల సన్నల౯ వలపుచల్లిననూరక యున్న వాఁడవీ|
చాయల నిన్ను నంటమని సారెకు దూరకు మన్మధుండు ప|
ల్చాయల యమ్ములేసినను సైపగవచ్చునె నీకు నిట్టు లి|
చ్చాయల లేమలంబరచఁ జాలునటుండుము వేంకటేశ్వరా||42||