Jump to content

పుట:శృంగారవృత్త పద్యాలు శ్రీ తాళ్ళపాక పెదతిరుమలయ్య.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

శృంగార వృత్తపద్యాల శతకము

ఉ॥ఆడకు దూరిమాఁటలిఁక నాడకు వత్తువుగాని వూరకే
వాడకు మోము జవ్వనము వాడకు మెవ్వ తెపట్లనైన నే
వాడకుఁ బోక కైకొనుకు వాడకు సాకుళులేలజోడుగా |
నోడకు దూలమైనక్రియ నోడక కూడుము వేంకటేశ్వరా||31||

ఉ॥తడబాటేటికిఁబోటికి౯ మగని యొద్దంజేరి దైవారి తా |
నొడఁబాటై కరగించఁ జెల్లు నిదె నీయొద్ద౯ విజృంభించి ని|
ల్కడఁ బాటల్ తగఁ బాడి యోడెఁ జెలికి౯ గట్టాయి దెట్టయ్యె నీఁ|
కడఁబాటింపుచు బాడుదు౯ వినుము వేడ్కన్ వేంకటాద్రీశ్వరా||32||

ఉ॥కానుకలిచ్చి నీ కెదురుగాను కరంబులుమోడ్చి మ్రొక్కియం|
దానను మీరివచ్చి మరి తానను నేఁటికి నీకె నవ్వెడిన్ |
మాను పరాకు నీవిచట మానుపడంగతమేమి యెప్పుడు౯|
మానము నీదు పొందులను మానములేటికి వేంటేశ్వరా||33||

ఉ॥చందనమాకెచల్లెఁ బెలుచందన మేర్పడ నీ కెదిట్టెనీ|
కుందనగంబుక్రిందఁ దనకుం గడు వాదువుట్టెనే |
వందనమాచరించి పిలువం దనరారఁగ వచ్చిరిద్ద రా |
సందనయోక్తిఁ దేల్చి యదునందన చొక్కుము వేంకటేశ్వరా||34||

ఉ॥సంగడి కాంతపొందులు వెసం గడియించితినంచు నంటివా|
యంగడినున్న పువ్వు వెలయం గడువుచ్చితి వీ వెరుంగవా|
గొంగడి గెంజలంబు లిరె కొంగడియాలము దానిలజ్జ యె|
ల్లం గడిగించి వచ్చెద నిల౯ గడివోతది వేంకటేశ్వరా||35||

ఉ॥పెంచె మరాళయాన తన పెంచెపుఁగృమ్ముడి భారమోచు౯ నే|
కొంచెము మద్యమంచు మదిఁ గొంచెమరిం దన యీడువారిలో|
మించెను నీవుగూడఁ గర మించెను వేడ్కలనీదు బాసలే|
పంచమ వేదమంచునుఁ బ్రపంచముసేసెను వేంకటేశ్వరా ||36||