శృంగార వృత్తపద్యాల శతకము
121
ఉ॥గరుపారందమి రెంచి నీసకియఁజక్కంజేరి ముంజేతి బం|
గరుపారావత మేమి చూపెదవు వేగన్ గూడగన్ బాన్పుడ|
గ్గరుపారాజసమెంతసేసెదవు వేడన్ నీనుభావం బెరుం |
గరుపారంబుగ నెవ్వరుంగలయ మింకన్ వేంకటాద్రీశ్వరా||13||
మ॥మొదలన్ పూఁబొదలన్ మరుండురోదలన్ ముుందాడి పెందాడిగా|
గదలన్ తుమ్మెదలంగెరల్చి మెదలంగా గాలిసంసీలియై |
యెదలన్ గ్రెక్కదలంగఁ జేసి దుదలన్ హేలాంక బాలాలికిన్|
పొదల౯ సంపదల౯ వరించు మనిశంబు౯ వేంకటాద్రీశ్వరా||14||
మ॥సతుల౯ సమ్మతుల౯ గెరల్చి రతులంజాలంగనోలాచి౯న౯ |
పతుల౯ సంగతులం గరంచి తతులంబై కొందురా కాంతలై|
గతుల౯ మామితుల౯ వరించి మతులంగంగించి కుంగింతురా|
నతుల౯ నీనుతుల౯ మెలంగగలదాన౯ వేంకటాద్రీశ్వరా||15||
ఉ॥పోరక పోర కాఁకలను పొద్దొక పంతవుమాఁట మాఁటల౯|
దేరక దేరక త్తియకు దీకొనిరాఁ బనియేమి పోదుని౯|
దూర దూరకల్పితమితుల్ దడవం జన దింతిఁజూచి నో|
రూరక యూర కచ్చటన యుండుము నీవిఁక వేంకటేశ్వరా||16||
తా||గోర౯గీరిన నెరగు౯ సతులతో గోరాది కేరాకురా |
మేరల్ మీరెదవూరకైన నిను నేమిదూరమారాడరా |
వీరు౯ వారును సారెనాకుసరియా వేమారునామారుగా|
నారుల్ గోరిన లేరు కూడుమిఁక నెన్న౯ వేంకటాద్రీశ్వరా||17||
చ॥నెమకుచుఁబొంచువింటి యటునేర్పున యూరక యుంటినీపయిం|
జెమటలు మించంగంటి కలసె౯ నినుఁ దామరకంటియొంటిగా|
సమకొని మోవిగంటి యిదె సాకిరియుండఁగ యిట్టినోరనే|
యమరని మాఁటలేమిటికి నాడెద విప్పుడు వేంకటేశ్వరా||18||