Jump to content

పుట:శృంగారవృత్త పద్యాలు శ్రీ తాళ్ళపాక పెదతిరుమలయ్య.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

శృంగార వృత్తపద్యాల శతకము

ఉ॥తాలిమితోడ నేఁ బిలిచి దండకు రమ్మని యానపెట్టి నం|
దేలఁగఁజూచి డగ్గఱవు దీనన సందియమయ్యె నాకు వే |
సాలకు నంటఁగాని సతి చయ్యన కూరిమి నిన్ను నంటెనో|
మేలముతోడఁ బిల్చి చెయి మీరెదనంచునొ వేంకటేశ్వరా||103||

ఉభయవృత్తపద్యాలు 103


శ్రీకృష్ణార్పణమస్తు


శృంగార వృత్తపద్యాలు సమాప్తము.