శృంగార వృత్తపద్యాల శతకము
135
ఉ॥అవ్వలనుండి యొక్క సతి యప్పుడువచ్చిన నేను నుండఁగా|
నవ్వెడురీతిఁ జొబ్బిలఁగ నాపయి గందము నీవు చల్లినం|
జివ్వననేను వేఱయొక చీర ధరింపఁగ నేఁగినంత నా |
జవ్వనిఁ గూడుకొంటి వది సందుగఁ గైకొని వేంకటేశ్వరా||97||
చ||కరమటువేసె నీదుపయిఁ గాంతల సందడిఁ బవ్వళింపఁగాఁ|
దరుణియొకతె౯ వేఱొకతె తానును బాదమువేసె నంత నీ|
చరణమయంచు నింతి చెయిచాఁచిన నా పె యెఱింగి తిట్టె ని|
ట్లరయఁగ నీవ రెంటికపుడాశ్రయమైతివి వేంకటేశ్వరా||98||
ఉ॥ చీటికిమాటికి బలుకు చెల్లఁగఁబెట్టెను నీదు చెక్కులం|
గాటుక లేలవచ్చె నవిగానక యాడితివేమొ చూచుకో|
గాటపుటద్దమందు మఱికల్ల నిజంబులు తానె యేర్పడు౯|
సాటికిఁ బేటికిం బగలు చాటఁగనేటికి వేంకటేశ్వరా||99||
చ||పులకలు మేననిండె నొకబోటినిఁ బేర్కొనినంత నీకు నేఁ|
బిలువఁగఁ బోదునో మగనిఁ బెండిలిసేసినఁ బుణ్యమౌను నా|
వలపటు వెట్టు నీ మనసు వచ్చినఁ బాలును నవ్వుగాదు నా|
తలఁపునఁ బాయ వెప్పుడును దప్పదు శ్రీ తిరువేంకటేశ్వరా||100||
చ||సరసుఁడవన్నిట౯ మిగులజాణవు నిన్ను నుతించు టొప్పగు౯|
దరుణికి వ్యంగ్యమాడవలె దప్పక కాంతునిఁ గన్న చోటుల౯|
విరసముగాదు చిత్తభవవిద్యకుమంత్రము దీనికై నినుం |
బరుసము లాడితిం బదరి పట్టకు మెగ్గులు వేంకటేశ్వరా||101||
చ||అలికులవేణి నొక్కరితె నంటితి వంచును వింటి దానికే|
యలిగితి నీవు లేదనుచు నానలువెట్టెదు సారెసారెకుం |
జలములుమానిన౯ మనసు సందియమేటికీ మానుఁ జాలు నీఁ|
నిలువునఁ గల్ల గల్గినను నిన్నె భజింతుము వేంకటేశ్వరా||102||