134
శృంగార వృత్తపద్యాల శతకము
చ||ఇల దొరలైన మానవతులెమ్మెలు చూపరు గుట్టుతోడనే|
మెలఁగుదురారజంబులను మేలములాడరు దంటయెవ్వతో|
కిలకిల నవ్వి ని౯ జెనకి క్రిందట మీఁదట లాడుచున్న దీ|
వలపులు నీకునుం బ్రియమొ వద్దనవైతివి వేంకటేశ్వరా||91||
ఉ॥ఇంటికి నిన్నుఁబిల్చి కడనెమ్మెలఁ బోవుచు నీయురంబున౯|
జంటగఁ జన్నులొత్తి నది చక్కఁగ రెంటెము గప్పు మందుపై|
నంటునఁ జూడరానివవి నాతుల సిగ్గులు దాఁచుటొప్పగు౯|
గొంటరివాకె నీవయిన గోప్యము సేయుము వేంకటేశ్వరా||92||
చ||మొదలనె నీవు నాదుపయి మోహము నించితి వింతలోననే|
వదలకు నీ వయోమదము వంచఁగ రాదిఁక వేయునేల నీ|
యుదుటులు గానవచ్చెఁ జెలులొద్దని డగ్గరి యున్న వారు నీ|
వదిమది నెంచుకొమ్ము వెడయాసలఁబెట్టకు వేంకటేశ్వరా||93||
చ||వలచినదాననేను మరివాసులు చూడఁగనేల యొద్దకుం|
బిలిచినఁ బిల్వకుండిననుఁ బెంపునఁ గొల్వులు సేయుచుండిన|
సెలవగు నాదు జవ్వనము చెప్పితి నీకిఁక నన్య కాంతలం|
గలయఁగ వేళ యౌనొ మఱికాదొ యెఱుంగను వేంకటేశ్వరా||94||
చ||పెనఁగకు నాయెడ౯ మనసుబెట్టితి నీకును వీడెమింద నీ|
చనువునఁ గొంగుపట్టితిని జారకు సంపదగల్గువారికి౯ |
వనితలు పెక్కులై తగులవచ్చినఁ జప్పనయౌనమైన నెం|
జెనకక మాన నిన్ను నిఁక సిగ్గులు చెల్లునె వేంకటేశ్వరా||95||
చ||ఒట్టులు మీరు వెట్టుకొని యోర్వక సంగడి బట్టెమంచముల్|
గుట్టుననెక్కి యాకె చనుగుబ్బల మారని కోళ్లు వేడ్కతో|
గట్టిగఁ గౌఁగిలించితివి శాంతయు గౌఁగిటలో దలాడ యే |
నెట్టన నీదు మారనుచు నించె ముదంబున వేంకటేశ్వరా||96||