శృంగార వృత్తపద్యాల శతకము
133
ఉ॥పిలువకునన్ను లోపలికి పెంపున నే సతి యెందునుండునో|
తెలియదు యేమఱించి మరి దిగ్గనవాకిటఁ జేరి నిల్చితి౯|
మలయుచు వట్టి దీమసపుమాఁటలు మానవు పంతగానికి౯|
నలె నిది నిన్ను మెచ్చితిని వచ్చితిఁ గూడితి వేంకటేశ్వరా||85||
ఉ॥పడతికి నీవు నమ్ముమని బాసలు చేయుచు నున్న వేళ న|
క్కడ నొక లేమ మీనటన కాంక్షలఁజూడఁగ దిష్టదిబ్బముల్|
దొడికెదనంచు నా కె చనుదోయి కరంబునఁ బట్టి నంత నీ|
నడవడిచూచి తొంటిసతి నవ్వెఁగదా తిరువేంకటేశ్వరా||86||
ఉ॥చల్లనిమాటఁలాడఁగను సారెకుఁ గోపము చూపరాదు నీ|
తొల్లిటి సేఁత లెంచినను తోడనె యందులకోర్వరాదిల౯॥
కల్లలు గల్గిన౯ విభునిఁగాదనఁజెల్లునె కాంతకు౯ సదా |
యుల్లమునందు సంతసిలియుండుట మేలిఁక వేంకటేశ్వరా||87||
ఉ॥నిక్కుచుఁజూచి యొక్కరితె నీకును ముచ్చటఁ జెప్పుచుండఁగా|
గక్కన వేగువెట్టుకొని కామిని యాచెలిఁ దమ్మవేసిన౯ |
చెక్కిలిదాఁకి యారజము చేరువనుండిన నీపయింబడె౯ |
చక్కటి నేలమానుమరిసంగడి నేరమి వేంకటేశ్వరా||88||
ఉ॥చన్నులు పూర్ణకుంభముల సాటిగ యెవ్వ తెనీకుఁజూపెనో|
సన్నుత దృక్చకోరముల చక్కఁగ మిక్కిలి వాలఁజేసెనో |
నన్నునుఁ గూడితౌను శఖున స్థితిమంచిది నీవువచ్చుచో|
నిన్నటి కోపమంతయును నెమ్మదిఁ బాసెను వేంక టేశ్వరా||89||
ఉ॥ఏదిర నాదు కంటసరి యిప్పుడు నీచెలిమేనఁ బెట్టితి౯|
నీదెసఁ జుట్టమాయదియు నెట్టన నీవలెనుండఁగానె పో |
పాదుగదాని నంటితివొ పైకొని నీపనుపంచునుంటినే |
భేదము లేక నీవలపు పెంచెదు బాపురె వేంకటేశ్వరా||90||