132
శృంగార వృత్తపద్యాల శతకము
చ||వెలఁదులు గొల్వుసేయునెడ వేడుక యొక్కతిమీఁదనిల్పి ని|
ట్టలముగ రత్న సౌధమున డాఁగిలిమూతల నాచరింతమా|
యలవడనంచు నేగి చెలి నక్కడఁగూడితి వెంతనేర్తు వో|
తెలియదు నీ మొఱంగని సతీమణులెంచిరి వేంకటేశ్వరా||79||
చ||చలమరించును నన్ను మరీ సారెకునాడెద వేవిసేసితి౯|
వెలుపలనీవునా పెయును వేడుకసల్పఁగ లోసనుంటి నేఁ|
గెలయుచు నింతిఁదిట్టితిని కింకల మీ రతివేళ విఘ్నముల్|
సలిపితినో వెతంబడకు సంగతులాయివి వేంకటేశ్వరా||80||
చ||పూని రతిశ్రమంబు ననుబోఁటియు నీవును నిద్రవోవఁగా|
లోనికివచ్చి కంజదళలోచనయొక్కతె నీదుమోవిపై |
తానొకగంటి సేసి యెడదవ్వులనుండఁగ మేలు కాంచి నీ|
పానుపుమీఁద కాంతయని పల్కఁగవచ్చునే వేంకటేశ్వరా||81||
చ||పేర్చి నయల్కతో సతులు బీరమునం బతిఁదిట్టువేళఁ దా|
నోర్చి ప్రియఁబువల్కుటకు నొద్దికతోడఁగరంగి మాటనూ |
రార్చి పెసంగు నవ్విభుని నక్కున జేర్తుదారు గారవంబున౯ |
నేర్చినవారికి వలపునిండు నిధానము వేంకటేశ్వరా||82||
ఉ॥ సంగడి నాకెయున్నదని సన్నలఁజెప్పెదవేను వచ్చినన్|
సంగతిగాదు మానినులఁ జౌకలు నేతు రె నీవు కాంతకు౯|
పంగెనవాఁడవా యెఱుఁగ బత్తియొనర్పఁగ నిన్ను జేరితి౯|
కంగెను దానిచితమిది గారణమై కడు వేంకటేశ్వరా||83||
ఉ॥చందురుఁడేమి సేయు మఱి చల్లనిగాలి కోఱంతయేది మా|
యందు వసఁతుఁడేడ పగయంగజునేఁటికి సారెదూర నీ |
విందుల కేగుదేఱక లయించఁగ వీరలు నీకతంబునన్ |
నిందలఁ బొందిరింకఁ గృపనించగదే తిరువేంకటేశ్వరా||84||