Jump to content

పుట:శృంగారవృత్త పద్యాలు శ్రీ తాళ్ళపాక పెదతిరుమలయ్య.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగార వృత్తపద్యాల శతకము

131

చ||కొసరుచుమాఁటలాడుమని కూరిమిచూపెదవాకెయుడఁగా|
నెసగునెముచ్చటాడ మనయింటికి వచ్చిన నట్లచే సెద౯|
సుసరముగాదు జంట మొనసూదిని రెంటెముగృవ్వనొక్కటే|
పొసఁగినచోట నేమనినఁబొంకగవచ్చును వేంకటేశ్వరా||73||

ఉ॥ఆసలఁ బెండ్లియాడి మఱియల్గినఁ జెల్లునె యెంత చేసినా|
వేసర నన్ను నీవునిఁక వేరుగఁజూడక మాఁటలాడుమీ|
దోసముగాదు నీగుణము తొల్లి నెఱుంగుడు తోడివారిలో|
వాసికి నేఁబెనంగెదను వంతలఁబెట్టకు వేంకటేశ్వరా||74||

చ||తగుఁదగుకునిద్దరికి దంపతులైతిరి యీ గవాక్షుల౯ |
మొగములు చూచుకొండు మరిమ్రొక్కుఁడు నేనిటుగంటినంచు మీ |
తగులమి మానరాదు రతితారసమాయెను మాకదేల యీ|
జగడము లింత కోపుదుమె చౌకలు సేయకు వేంకటేశ్వరా||75||

ఉ॥మాయలవాఁడవన్నిటను మాఁటలు నేర్తువు చేఁతలిన్నియుం॥
జాయకుఁ దెచ్చి చెప్పెదవు జాణతనంబిది మేలు వింటినే|
నీయెడగాఁదటన్న మరియేడకు నెక్కెడునాఁడు మాటన౯|
రాయడిఁబెట్టకింకఁ గొసరంబులుమారును వేంకటేశ్వరా||76||

ఉ॥తడవకు నీవు మమ్ము నినుఁ దప్పులు సారెకుఁ బట్టనేల నీ|
నడవడి యెప్పుడు గలది నాకిఁకఁ జక్కటులేల దిద్ద నీ |
పడఁతులు వారె నావలని పంగెనయేఁటికి నిందు మోహమె|
య్యెడలను లేదు నీకు నదియేను నెఱుంగుదు వేంకటేశ్వరా||77||

ఉ॥ఈదెసనన్ను వేఁడుకొని యింతటివాఁడవు బుజ్జగింపఁగాఁ|
గాదన నేల నిన్నుఁగడుఁ గల్లయొనర్చినవాఁడు వచ్చి తా|
లేదనినంతఁ బోవు మరలించితిఁ గోపము వాదులేలనీ |
పాదముదెమ్ము మ్రొక్కెదను పాన్పిదెరమ్మిఁక వేంకటేశ్వరా ||78||