Jump to content

పుట:శృంగారవృత్త పద్యాలు శ్రీ తాళ్ళపాక పెదతిరుమలయ్య.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగార వృత్తపద్యాల శతకము

129

చ||ఎఱుఁగక నవ్వినందులకు నేమనినా నిఁక నీకుఁజెల్లు నీ|
మఱుఁగున నాకెడాఁగినది మానుగ నే నటుచూడనైతి యీ|
తెఱఁగులు తొల్లి లేవు పలుదిక్కులఁ క్రొత్తలు నేచు కొంటివా||
వెఱపున లొంగుటేఁదెలియ వేసటబెట్టితి వేంకటేశ్వరా||61||

ఉ॥కామిని చన్నులంచును నగంబులుద్రాకి కరంబులుచు నా|
రామములోనఁ దీగెలను రాగపు కౌంగిటఁజేర్చి నిశ్చయం |
బేమిటఁజేయరాక మదినెంచి కుచుబులఁ దద్భుజంబులం|
బ్రేమ నఖంబులం గుఱులువెట్టితివప్పుడు వేంక టేశ్వరా||62||

చ||చెలి నిఁక గాసినేయ కిదె చెక్కిట చేదగజేర్చి సెజ్జ చెం|
తల నతి చింతలం గెరలి తక్కక నిన్నె తలంచెఁగాఁ కలన్|
కలగక యింతటం దగిలి కాఁగిటఁ జేర్చిన గించితియ్యెడన్|
నిలిచిన నేక కీర్తికాయట నీకిట శేషగిరీంద్రనాయకా||63||

చ||అలుగుచు గాంత మారుమొగమై యటుచూచిన దర్పణంబున౯|
బెళకక నీ మొగంబు ప్రతిబింబము గానఁగవచ్చె నంతలోఁ |
గలకల నీవు నవ్వితివి కాంతయునవ్వేను మీకు నద్దమే|
యలుకలు దెర్చెదోడి చెలు లచ్చరువందగ వేంకటేశ్వరా||64||

చ||వలిపెముగట్టి లేదొడల వన్నె మెఱుంగులు నిన్నుఁగప్పఁగా|
జలజదళాక్షి యంటె నటుసంపఁగినూనియ నీకునా కెమై|
నలఁదిన గందమే యమరె నప్పటి కయ్యట కంటిచందమై|
జలకములయ్యె పెంజెమట సంతసముదుము వేంక టేశ్వరా||65||

చ||పతముతోడఁ గొల్వు నను భామల మెల్లఁ గనుంగొనంగ నా|
కాంతకునీవు కంట సరిగట్టెదు కౌఁగిటఁ జేర్చుకటయ్యెనే |
యంతటఁ దీరెనే తనివి యాపెకు సందరిఁగన్మొరంగి నీ|
వెంత నెపంబుపెట్టి తిపు డిందులకే తిరు వేంకటేశ్వరా||66||