Jump to content

పుట:శృంగారమంజరి- తాళ్లపాక అన్నమాచార్యులు.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

శృంగార మంజరి.

పసిఁడిపాదుకల స్వభావమై నిలువఁ|గైకొని మెట్ట నక్కడిచోటు లెల్లఁ|
బ్రతిపదంబును మోక్షపదములై నిలువ|నింద్రాది దిక్పతులిరువంకఁ గొలువఁ|
[1]గమలభవాదులు గదిసి తో నడవఁ|గిన్నర గంధర్వ ఖేచర యక్ష|
గరుడ విద్యాధర గాన మానములు[2]|వీనుల కిం పొంద విందులు సేయ|
[3]విరివైన యుద్యానవీథులు సొచ్చి|విశ్రాంత భూముల విహరించుచోట|
నేవేళ నేకాల మెక్కడఁ దలఁచె|నావేళ నాకాల మక్కడఁ గలిగి|
సకలపదార్థగోచరములై[4] యుండి|చతురవిద్యాగోష్ఠిఁ[5] జరియించునంత|
నఖిలాదినాథు మోహన మహామూర్తిఁ|బలుమాఱు మును విన్న భామాలలామ|
చెలులకు మన సీక చిత్తంబు రాక|పొలుపైనయలవోకఁ[6] బ్రొద్దులు వోక|
సఖులతోఁ బుష్పాపచయకేలిఁ[7] దగిలి|యున్నంతఁ జెలిభావ మువిదలు చూచి|
పువ్వులు [8]జడిగొన్న పొదరిండ్లు దూఱి|కాంతల నొండొంటిఁ గడవంగఁ బాఱి|
తఱచైనవిరు లెల్లఁ దమ వని కోరి|చెదరిన [9]లతలెల్లఁ జేరంగఁ దీసి|
యందనిక్రొవ్విరు[10] లందంది కోసి|తావి[11] వోవకయుండఁ [12]దలిరులు మూసి|
రాలినపుప్పొళ్లు రాసులు చేసి|[13]యనిలంబు కెదురు మహాఫణి వ్రాసి|
తుమ్మెదదాఁటులఁ దొలఁగఁ దూపొడిచి[14]|పై కాపుగాఁగ సంపంగలు ముడిచి|
చేతులపన్నీరు చెలులపైఁ దుడిచి|పయ్యదఁబూఁదేనె పలుమాఱుఁ బిడిచి[15]|
[16]యారామవీథుల నతివలు మెలఁగి|[17]యొఱపైన చోటుల నొయ్యనఁ[18] తొలఁగి|
దట్టంపువిరు[19] లెల్లఁ దమవని చెలఁగి|మరునమ్ములో[20] యని మదిలోనఁ గలఁగి|
బింబంబు లని యోష్ఠబింబంబులకును[21]|[22]బైకొన్న చిలుకలఁ బట్టంగఁ దలఁచి|
[23]వల నైనకరపల్లవంబులు చాఁపఁ|బల్లవంబులభ్రాంతిఁ [24]బదరి కోయిలలు|
చేరినఁ బయ్యెదచెఱఁగులఁ [25]జోఁపఁ|బయ్యదబయ లైన పాలిండ్లు చూచి|


  1. కమలభవ= బ్రహ్మ
  2. మానము=తాళాదిలక్షణయుక్తత
  3. విరివి=విస్తారము
  4. గోచరములు=కనఁబడునవి
  5. గోష్ఠి = సలాపము
  6. అలవోక=లీల
  7. ఆపచయము =కోయుట
  8. జడిగొన్న = వర్షించినట్టి దట్టమైన
  9. లతలు =తీగలు
  10. క్రొవ్విరులు=క్రొత్తపూవులు
  11. తావి వాసన
  12. తలిరులు=చిగుళ్లు
  13. అనిలము=గాలి
  14. తూపొడిచి=బాణము నాటి
  15. పిడిచి=పిండి
  16. ఆరామము=తోట
  17. ఒఱపు=రాపిడి
  18. ఒయ్యన=మెల్లఁగా
  19. విరులు=పూలు
  20. అమ్ములు=బాణములు
  21. ఓష్ఠబింబములు=దొండపండువంటి పెదవులు
  22. పైకొను= కవియు
  23. వలను=ఒప్పిదము
  24. పదరు=త్వరపడు
  25. చోఁపన్=తఱుమఁగా