4
శృంగార మంజరి.
బొన్నలు వికసించెఁ బొగడలు నించెఁ | బనసలు నెరిసె సంపంగలు విరిసె |
[1]మలయజంబు లెలర్చె మరువంబు పేర్చె | నేవంకఁ జూచిన నెల్ల భూజములు |
శాఖోపశాఖ లసంఖ్య మై నిగుఁడ[2] | బూవుగుత్తులచేతఁ బూపలచేతఁ[3] |
బరిపక్వరసపూర్ణఫలములచేత | గగనమండల మెల్లఁగలయ[4] నందంద |
కప్పిన నిబిడాంధకారంబుదోఁపఁ[5]దారనివిరు లెల్లఁ దారలు గాఁగఁ |
గురియుపూఁదేనెల[6] క్రొమ్మంచుమించ | [7]మలయఁబుప్పొళ్లదుమారంబు[8] రేఁగఁ |
గేలీగృహాంగణాంకితఘననూత్న | వజ్రప్రకాశదివ్యప్రభావలుల[9] |
వెలుఁగొంది దట్టంపు వెన్నెల గాయఁ | [10]గుముదాకరంబులఁ గూటంబు మాని |
కుముదాకరంబులఁగొమరు[11] దీపించి | [12]పద్మరాగప్రభాప్రౌఢిమ వంపఁ[13] |
బద్మరాగప్రౌఢిమ దోఁప | [14]జ్యోతిర్లతాక్రాంతశోభితశ్రీలు |
బాలార్కకిరణసౌభాగ్యంబు లొదవ | సకలవనాంత[15]విశ్రాంత పాంథులకుఁ |
బగలు రేలై తోఁచుఁ బరికింప రేలు | పగళులై తోఁచి విభ్రాంతి పుట్టించు |
నత్యంతవేగవిహారమారుతము | సొరిది[16] నవ్వనవీథి సొచ్చినంతటను |
[17]గడఁగి[18]గందపుఁగొండకందువ[19] మఱచి[20]క్రమ్మఱ నొకవంకఁ గదలిపోలేక |
ఫణిరాజముఖులకుఁ [21]బసలు పుట్టించు | [22]ఫణిరాజగోత్రసౌభాగ్యంబు మరఁగి |
[23]కదిసి యాకాశగంగాతరంగముల | నాడెడునవ్యదివ్యాంగనాశ్రేణి |
కుచకుంభలిప్త[24] కుంకుమములతోడఁ | [25]జల్లుఁ బోరాడు నిచ్చలు[26] నొక్కవేళ |
మాధవీనవలతామందిరామంద | సౌధవీథీఘనస్థలములు [27]మెట్టి |
- ↑ మలయజంబులు=గంధపుమ్రాఁకులు,ఎలర్చెన్=వికసించెను
- ↑ నిగుడ=వ్యాపింపఁగా
- ↑ పూఁపలు=పూబిందెలు
- ↑ కలయ=అంతట
- ↑ తారని=కనఁబడకపోవని
- ↑ క్రొమ్మంచు=క్రొత్తమంచు
- ↑ మలయ=వ్యాపింప
- ↑ దుమారము= దుమ్ము
- ↑ ఆవలులు= సమూహములు
- ↑ కుముదాకరంబుల=తెల్లకలువలుగల సరస్సులలో
- ↑ కూటము=స్నేహము,కొమరు=మోజ్ఞత్వము
- ↑ పద్మరాగ=కెంపుల యొక్క,
- ↑ వంప=తగ్గింప
- ↑ జ్యోతిర్లిత=రాత్రుల వెలుఁగిచ్చునొకసిద్ధెషధి, ఆక్రాంత చుట్టఁబడిన
- ↑ విశ్రాంత=ఆలపుఁదీర్చికొన్న, పాంథులు=బాటసారులు
- ↑ సొరిది=వరుసగా
- ↑ కడఁగి=పూని
- ↑ గందపుఁగొండ=మలయపర్వతము
- ↑ కందువ= జూడ
- ↑ క్రమ్మఱన్=మరల
- ↑ పసలు=ఉద్రేకములు
- ↑ ఫణిరాజ,గోత్ర=నాగులకురాజగు శేషుని,పర్వతముయొక్క
- ↑ కదిసి=కూడి,తరంగములు=అలలు
- ↑ లిప్త=పూయఁబడిన
- ↑ చెల్లుఁబోరాడు= జలక్రీడలాడు
- ↑ నిచ్ఛలు=నిత్యము
- ↑ మెట్టి= తొక్కి