Jump to content

పుట:శృంగారమంజరి- తాళ్లపాక అన్నమాచార్యులు.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

శృంగార మంజరి.

బాలికారత్నంబుఁ బట్టంబు గట్టి|[1]యరవిరిసిగ్గులు నాత్మనిగ్గులును[2]|
మితిలేనితావులు మెఱుఁగుమోవులును|గనుఁగ్రేవకెంపులుఁ[3] గలికిసొంపులును|
ముద్దులేఁ జెమరును మోములకొమరుఁ[4]| గలిగినశృంగారగరిమలతోడ|
వంది[5]మాగధుల[6] కైవారంబుతోడ[7]|సిద్ధవిద్యాధరశ్రేణులతోడఁ|
దనతోడఁ గూడినతన్వంగితోడ|వృషభాద్రినాథుఁ డుర్వీసతిప్రియుఁడు|
వేడ్కతో నగరప్రవేశంబు చేసె|నని భక్తిఁ దిరువేంకటాద్రీశుపేరఁ|
గారుణ్యలక్ష్మీప్రకాశునిపేర|[8]రాజితాఖిలలోకరక్షణుపేర|
లాలితబహుపుణ్యలక్షణుపేర| [9]పృథులదానవసైన్యభీషణుపేర|
భూరికౌస్తుభరత్నభూషణుపేర|గురుభరద్వాజైక[10]గోత్రపావనుఁడు|
నందాపురీవంశనాయకోత్తముఁడు|[11]అనఘుఁడు తాళ్లపాకాన్నయార్యుండు|
మధురంపుశృంగారమంజరి చెప్పె|ధరమీఁద నాచంద్రతారకం[12] బగుచుఁ|
గడిమిఁ బెంపొందు మంగళమహాశ్రీల||
శ్రీకృష్ణార్పణమస్తు| మంగళమహా శ్రీ శ్రీఁ జేయున్‌.

సాళంగ నాట

అప్పనివరప్రసాది యన్నమయ్య। [13]యప్పసము మాకే కలఁ డన్నమయ్య।
అంతటికి నేలికైన యాదినారాయణుఁ దన। యంతరంగాన నిలి పెనన్నమయ్య।
సంతసానఁ జెలువొందిసనక సనందనాదు।లంతటివాఁడుతాళ్ల పాకన్న మయ్య।।౧॥
బిరుదు టెక్కములుగాఁబెక్కు సంకీర్తనములు। హరిమీఁదనా నతిచ్చెనన్నమయ్య॥ ।।
[14]విరివిగలిగినట్టివేదములయర్థమెల్ల।నరసితెలిపినాఁడన్నమయ్య।
అందముగ రామానుజాచార్యమతమున। [15]కందుకొని నిలిచినాఁడన్నమయ్య।
విందువ లెమాకును శ్రీ వేంకటనాథునినిచ్చె।


  1. అరవిరి=సగము వికసించిన,ఇంచుకబయలైన
  2. నిగ్గులు = గొప్ప కాంతులు
  3. కెంపులు=ఎఱుపులు
  4. కొమరు =అందము
  5. వంది=బట్టు,
  6. మాగధుఁడు=వంశవీర్యాదులను బొగడి యుపజీవించువాఁడు
  7. కైవారము=స్తోత్రము
  8. రాజిత=ప్రకాశించిన
  9. పృథుల= విరివియైన
  10. ఏక=ముఖ్యము
  11. అనఘుఁడు=పుణ్యాత్ముఁడు
  12. ఆచంద్ర తారకం బగుచుక్= చంద్రుఁడు నక్షత్రము లున్నంతవఱ కుండునదియై
  13. అప్పసము=ఎడపక
  14. విరివి=విస్తారము
  15. అందుకొని = చేరి