పుట:శృంగారనైషధము (1951).pdf/333

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

316

శృంగారనైషధము


ద్యాలంకార! కరాళహాలహలజిహ్వాభీలనిస్త్రింశ! లో
కాలోకోపరిభాగసంతమససంహారప్రతాపాతపా!

204


క.

 హాటకరత్నమయతులా
కోటిఝళంఝళకఠోరకోలాహలవి
స్ఫోటితకుటిలమహీభృ
త్కోటీకఠినాంతరంగ! తులితానంగా.

205


మాలిని.

జగదవనధురీణా! సాధురక్షాప్రవీణా!
నగపతిసమధైర్యా! నందితాచార్యవర్యా!
యగణితగుణభద్రా! త్యాగముద్రాసముద్రా
విగతసకలదోషా! విశ్వలోకైకభూషా!

206


గద్యము.

ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సకలవిద్యాసనాథ శ్రీనాథప్రణీతం బైనశృంగారనైషధకావ్యంబునందు అష్టమాశ్వాసము.

శృంగారనైషధకావ్యము సంపూర్ణము.

చెన్నపురి : వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారి

'వావిళ్ల' ప్రెస్సున ముద్రితము:-1951