పుట:శృంగారనైషధము (1951).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16 శృంగారనైషధము


జిప్పిలుచుండ నెద్ది పరిశీలన సేసిరొ యట్టియబ్బెసం
బిప్పుడు వారు చూపుదు రపేతనిమేషములైనచూపులన్.

67


తే.

తద్గుణాకర్ణనంబునఁ దదనిరీక్ష
ణమున ధన్యత్వమును నధన్యతయుఁ బొంది
యభిమతానభిమత మైనయక్షియుగముఁ
దాల్చుఁ జక్షుశ్శ్రవఃస్త్రీకదంబకంబు.

68


చ.

[1]మొలచినకూర్మి గన్నుఁగవ మోడ్చినయప్పు డజప్రభావనా
బలమున నానృపాలకునిఁ బాయక చూతురు మర్త్యభామ లా
యలికులనీలవేణులకు నమ్మెయి నవ్విభుఁ జూచువేళలన్
గలుగవు వో నిమేషపరికల్పనఁ బుట్టెడునంతరాయముల్.

69


సీ.

కోరి లీలాగేహకుడ్యభాగంబుల
        వ్రాయుదు రమ్మహీశ్వరునిమూర్తి
వ్రాసి కన్యాత్వగౌరవము వీసరపోవ
        దర్శింతు రనురాగతరళదృష్టి
దర్శించి యతని కేఁ దగుదునొ తగనొ యం
        చించుకించుక సంశయింతు రాత్మ
సంశయించి కరాంబుజములఁ గ్రొమ్మించుట
        ద్దము లెత్తిచూతురు తముఁ దారు


తే.

రాజకన్యలు జగతి నాక్రమమునందు
గందు వారలనిట్టూర్పు గాడ్పువేఁడి
ముకురములు చారుమోహనమూర్తి యనఁగఁ
బరఁగు దమయంతిచేతిదర్పణముదక్క.

70
  1. పొలుపొనఁగూడి; పొలుపొగిజూచి అని పాఠాంతరములు.