పుట:శృంగారనైషధము (1951).pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

253


రాగంబులు విని మది ను
ద్వేగంబు వహించుఁ జేఁదు దిన్నవిధమునన్.

129


సీ.

అప్పరాకుఁడు పరాకమ్మగా రేతెంచు
        త్రోవకు దూరంబు తొలఁగిపోవు
నాదోసకారి సన్న్యాసి దవ్వులఁ గాంచి
        యోలంబునకు దారియొదిఁగి యుండు
నాపాపజాతి మాసోపవాసిని నీడ
        లంఘింపఁ బోయి కా ల్నలియఁ గూలు
నావెనుగొఱుకు యాయావరవ్రతధారిఁ
        బగదారి యని డస్సి పండ్లు గొఱుకు


తే.

నానృశంసుండు నుసుఁగు వైఖానసులకు
నాదురాత్ముండు శ్రోత్రియు నపహసించు
నాఖలుఁడు సోమయాజి నిరాకరించు
నక్కిరాతుఁ డనుష్ఠాత ధిక్కరించు.

130


శా.

ఆనిర్భాగ్యుఁడు గాళరాత్రి యని హాహాకారముం జేయుడెం
దాన న్సాధ్వస మంది బ్రాహ్మణులు సంధ్యావేళఁ జేతస్సమా
ధానం బొప్పగ నావహింప నుదయత్సప్తాశ్వబింబంబులోఁ
గా నాకాశపథంబు నిండికొని శ్రీ గాయత్రి యేతేరఁగాన్.

131


తే.

జినగవేషణనిరతుఁ డాచెట్ట సూచు
[1]నభినవబ్రహ్మచారిచయంబు నెదుర
క్షపణకాలోకనార్థి యాఖలుఁడు గాంచు
నక్షపణకేళి రాజసూయాధ్వరమున.

132
  1. 'అభినవబ్రహ్మచారిచయాజినంబు' అని పాఠకల్పనము మూలానుగుణము.