పుట:శృంగారనైషధము (1951).pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

శృంగారనైషధము


తే.

వేయుమాటలు నేల? యో విబుధలార!
యవధరింపుఁడు నిజము మీయడుగులాన
భైమితో భూమితో బెడఁ బాపువాఁడ
నిమిషమాత్రంబునంద యానిషధపతిని.

121


వ.

అని పలికిన నెమ్మనంబులం గుత్సించుచు నతని యుత్సాహంబు దైవకల్పితంబు గావున నన్యథాకరింప నలవి గాక నాకవప్రముఖు లగుబర్హిర్ముఖు లన్యోన్యముఖావలోకనంబు సేసి మనకుం గలిరాజుతోడ సంవాదం బింతియ చాలు, తమ్ముండు నన్నయు నగుకలిద్వాపరంబులు బ్రహ్మలోకంబుననుండి యాబ్రహ్మనియోగంబునం బోవుచున్నవారు గావలయుఁ బాఱెడునీళ్లకుం గట్టపెట్టం బని యేమి? 'పొదండు పొదం డ'ని పోయిరి. కలియును, గామక్రోధలోభమోహపరివారపరివృతుండై నిషధదేశంబుచాయన భూమండలంబునకు డిగ్గె నప్పుడు.

122

నిషధదేశంబునఁ గలిపురుషుని దుర్వర్తనము

సీ.

[1]హోమాగ్ని ధూమోర్మి కుద్వేగ మొందుచుఁ
        గ్రతుధూమములచేత గాసిపడుచు
నతిథిపాదక్షాళనాంభఃప్లుతము లైన
        గృహమేధిమందిరక్షితితలముల
జీరువారుచుఁ బూర్తశిశిరానిలంబులఁ
        జలివట్టి వణఁకుచు సవనశుష్మ
ఫుటపాకములవెక్కఁ బురపురం బొక్కుచుఁ
        బశుబంధములఁ జూచి భయముపడుచు

  1. 'హోమాజ్యగంధోర్మి' అని పాఠకల్పనము సమంజసము.