Jump to content

పుట:శృంగారనైషధము (1951).pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

శృంగారనైషధము


కాగ మొనరించు నఁట తా విరక్తి యెట్లు
తన ప్రభావంబు గ్రోధంబు తాన యెఱుఁగు.

49


మ.

భ్రుకుటీకాలభుజంగ రాజతరుణీఫూత్కారశంకావహా
ధికనిశ్వాససమీరణధ్వనులు సంతీక్ష్ణాగ్రదంతావళీ
శకలీభూతనిజాధరోష్ఠరుధిరస్రావప్రతిద్వంద్విర
క్తకటాక్షుల్ దనపారిపార్శ్వికులు గా దర్పంపుఁ బెంపేర్పడన్.

50


వ.

ఇ ట్లేతెంచె ననంతరంబ.

51


లోభుఁ డెదురుపడుట

తే.

హస్తములు విస్తరించుచు నఱ పలుకుచుఁ
గంఠగద్గది కావ్యక్తకాకువికృతి
రాలుపడి బం డ్లిగుల్చుచుఁ దీలుపాటుఁ
బ్రకటదైన్యంబుఁ దోఁప లోభంబు వచ్చె.

52


సీ.

కడుపుమండించునాఁకటిచిచ్చుసెగ దాఁకి
        గవరనై యున్న కన్గవలవారు
భోగించువారలఁ బుల్కుపుల్కునఁ జూచి
        మెల్లన గ్రుక్కిళ్లు మ్రింగువారు
కుక్షింభరిత్వంబుకొలఁది కగ్గలముగా
        గూఁ డెంత పెట్టిన గుడుచువారు
ప్రాణగొడ్డము లైన పరమసాహసములఁ
        బరులసొమ్ముల కాసపడెడువారు


తే.

పామునకు బలి వెట్టనిప్రతినవారు
[1]ఈఁగ కెన్నఁడు నే నిలి యిడనివారు

  1. 'ఈగ కెన్నఁడు గాటిని యిచ్చునారు' అని పాఠాంతరము చింత్యము.