ఈ పుట అచ్చుదిద్దబడ్డది
176
శృంగారనైషధము
| త్తేజోధూమధ్వజంబుల్ దిరిగి తిరిగి రోధించు దుస్సాధలీలన్ | 150 |
ఉత్కలదేశరాజు
వ. | అనియె నాసమయంబున సమీపవర్తిని యగు తాంబూలకరంకవాహిని దమసహోదరిభావం బెఱింగి భారతీదేవి నుద్దేశించి యోదేవి! యీ వసుధావల్లభునిమీఁద నిప్పల్లవాధరకు నుల్లంబు పల్లవింపదు వచనపరిశ్రమంబు వలదు. వాఁడె యుత్కలదేశాధీశ్వరుం డమ్మహీశ్వరుగుణకలాపంబు లభివర్ణింపు మనుటయు. | 151 |
క. | భారతి రతీశకల్పుని | 152 |
క. | ఇతఁ డుత్కలదేశాధిపుఁ | 153 |
మ. | చెమరించుం దుహినచ్ఛటాచ్ఛలమునన్ శీతాంశుబింబంబు రేఁ | |