ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు
శృంగారనైషధము
చతుర్థాశ్వాసము
| శ్రీమచ్ఛరణాంభోరుహ | 1 |
నలుని రాయబారము
వ. | అవధరింపు మివ్విధంబున విబుధమాయాంధకారంబు దూరం బగుటయుం గట్టెదుర నాజగజెట్టి జవనిక వాయందట్టినం బొడసూపుబహురూపుతెఱంగున, జలధరతిరోధానంబు వాసినం బ్రకాశించు నాహిమధామునిపగిది, నవిద్యావరణంబు విరిసినం దోఁచుపరమాత్మునిప్రకారంబున, దోహదపలాలజాలంబు విరిసినం బ్రేక్షణీయం బగుపుండ్రేక్షుకాండంబుభంగిఁ, బరమాద్భుతాస్తనిమేషముద్రుండును నిర్ణిదరోమప్రరోహుండును నిశ్చలాంగుండును వైశాఖస్థానకలితుండును నిర్వికారుండును నై భీముభూపాలపుత్త్రికకు నేత్రవిషయీభావంబు భజియించె, నప్పు డప్పుడమిఱేనిం గనుం | |