పుట:శృంగారనైషధము (1951).pdf/122

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

105


[1]బలభేదిముఖచతుర్బర్హిర్ముఖప మన
        స్సారంగబంధపాశంబు లొక్కొ


తే.

యధికదీర్ఘకటాక్షబాణాగ్రకషణ
శాణచక్రప్రసారమసారతరళ
భర్మతాటంకనేపథ్యభాసురములు
దీనివీనులు శ్రీకారమానదములు.

183


తే.

పదియు నెనిమిదివిద్య లీపద్మనయన
శ్రవణముల రెంట నర్ధ మర్ధము గ్రహించె
నంతరుత్కీర్ణగంభీరహారిలేఖ
యది గదా వీనులందుఁ దొమ్మిదవలెక్క?

184


తే.

అవటు శోభితమాణవకాభిరామ
యంచితోర్ధ్వగతాలింగ్యతాతిహృద్య
యద్భుతైకనిదానశోభాస్పదంబు
కంబుబిబ్బోకవతి దీనికంఠలక్ష్మి.

185


క.

కవితాగానప్రియవా
గ్వివరణసీమావిభాగవిధిరేఖలు నా
ధవళాక్షికంఠసీమం
బ్రవిమలరేఖాత్రయంబు ప్రస్ఫుట మయ్యెన్.

186


క.

కాంతాబాహుద్వంద్వా
త్యంతపరాజయసమాశ్రితాంభోదుర్గా
భ్యంతరము లైనబిసముల
కంతర్నిర్వ్యథనకలన మది యెట్లొక్కో?

187
  1. ‘బలభేదిముఖచతుర్బర్హిర్ముఖోన్మనః, ప్రతిబంధవాగురాపాశ మొక్కొ’ అని పా.