పుట:శృంగారనైషధము (1951).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

శృంగారనైషధము


తే.

మహితలావణ్యగుణజాయమానబహుళ
మాధురీచిత్రశోభాసమన్వితంబు
ప్రార్థనాకల్పపాదపప్రాజ్యఫలము
తియ్యపూఁదేనియలగ్రోవి దీనిమోవి.

170


ఉ.

భాసురమధ్యరేఖ కిరుపక్కియలందును మోవి కించిదు
చ్ఛ్వాసము నొందియున్న యది చంద్రనిభాస్యకు నే నొకప్డు ని
ద్రాసమయంబులం గలలరాకల నీకలకంఠిఁ గూడి వ
క్త్రాసవ మాని యాని దశనాంకుర మొత్తఁ గదా రసోద్ధతిన్.

171


ఉ.

[1]ఈ గజరాజగామిని మదేతదయోగభరప్రభూతిమూ
ర్భాగతఖేదరాత్రిసమయావధిభూతవిభాతసంధ్య కా
లాగరుచిత్రకాంధతమసాంశసమన్విత జంభవైరికా
ష్ఠాగతరాగకర్త్రి ప్రకటద్విజసేవిత యౌట చిత్రమే!

172


ఉ.

ఈయెలదీఁగఁబోణి కృపయేర్పడఁగాఁ దనలేఁతనవ్వుతో
వేయవ పా లపాంగముల వెంటఁ బ్రసాదము చేసిన న్నిశా
నాయకుఁ డెంతయం బ్రియమునం గయికోఁడొక నాల్గుదిక్కులం
బ్రాయపుచంద్రిక ల్వడసి పాఱఁగ వైచుచు నప్పదార్థమున్.

173


తే.

దాడిమీపక్వఫలబీజతతుల గెలిచి
దంతకురువిందపంక్తి యీతరుణి కమరు
సాంధ్యశీతాంశుమండలస్యందమాన
నవసుధారసబిందుబృందంబువోలె.

174
  1. ఈ పద్యము పూర్వముద్రితపుస్తకములలో లేదు. వ్రాతపుస్తకములో దొరికినది.