జనంబు నవలోకించి లాఘవభయంబున నపసర్తుకామ యయ్యె
నప్పుడు దానివల్లభుండు విడువకున్న నది స్వయంగ్రహలాఘవ
వతిరోధానంబువలనను వల్లభవాల్లభ్యప్రకాశనంబువలనను
నతిగౌరవంబు నొంది యొప్పె మఱియునొక్కఖండితనాయిక
రాత్రిసమయంబున సపత్నీగృహంబునకుం జనియెననెడు
రోషంబున వల్లభు నొక్కపదంబైనఁ జలింపకుండఁ బుష్పమా
లికచేత బంధించిన నతండు భయంబువలన జలించుటకు సమ
ర్థుండు గాక బద్ధుండై యుండి నబలాకృతమాలికాబంధంబైనను
బ్రియతములైన యౌవనపురుషులశక్తి హరించు టది యుక్తంబె
కదా యని పలికె; వెండియు వేఱొక్కఖండితనాయిక యపరాధ
కారియైన నిజకాంతుండు పల్లవదానంబునఁ బ్రసాదంబు వడయ
వచ్చిన నతని భర్జింపుచు నిట్లనియె.