Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్రగ్ధర.

కాంతారత్నంబు వేడ్కన్ గతిపయసఖులం గాంక్షతోఁ గూడి యొంటిన్
గాంతారోర్విం జరింపం గడువడిఁ జనినన్ గాంచితద్భర్త వెంటన్
గంతుక్రీడాక్షణోరఃకలితరుచిరలాక్షారసార్ద్రాంఘ్రిరేఖా
కాంతంబై యొప్పుదానిన్ ఘనసతిపదమున్ గాంచి యాజాడ నేగెన్.

99


సీ.

స్ఫురదనంగ సౌఘపూర్ణనాభిహ్రద
                        పరివాహకృతరోమపంక్తు లైన
లలన లెవ్వరు సవిలాసయానరవిత
                        హంసకభూషలై యరిగి రట్టి
సతులాపగాతీరగతలయి జనమనో
                        లక్ష్యవేదనచటులప్రసూన
శరధనుర్జ్యానాదశంకను బుట్టించు
                        శ్రుతిహితసారసరుతము వినిరి


గీ.

యుత్సుకాళులు మాధవయువతిజనులఁ
బిలిచి నటువలె గానంబు సలిపెఁ గాన
నాళి పల్లవాంగుళులచే నభినయించి
యాడి నటులుండె గానంబు ననుసరించి.

100


చ.

కుసుమసుగంధియై విపినకుంజమహీజనిరుద్ధవేగుఁడై
యసమజలాశయప్రచలితాచ్ఛతరంగజలార్ద్రుఁడై వన
శ్వసనుఁడు సంచలద్భ్రమరవక్షవిఘట్టనసంభవోల్లస
త్ప్రసవరజంబు భామినులపై వెదజల్లుచు వీచె నత్తఱిన్.

101


క.

వనమారుతానుగమనం
బునఁ దుమ్మెద లనుభవించె ముదితల ముఖవా
సనలు మహాత్ములవెంటన్
జనినఁ బురస్థములు గావె సంపద లెందున్.

102


గీ.

శౌరియువతికరాబ్జసంసర్గసంప
దాత్తసౌమనస్యంబులై యలరు విరులు
సార్థముగ నాఁటనుండియు నవనితలము
నందు సుమనోభిధానంబు నధిగమించె.

103


చ.

ఉరువడి నాభిముఖ్యముగ నుద్ధతిఁ జెంది విరుల్ దెమల్పఁగాఁ
దిరముగఁ సాఁచి పైకిఁ జనుదెంచు వరోరుకరాగ్రరాజిచే
వరుస గుణప్రకర్షమునఁ బల్లవపాళిబలాత్కృతంబుగాఁ
బరగ నఖంబులం జిదిమి భంగమునొందె సమత్సరంబుగన్.

104


చ.

తతమకరందపానముదితభ్రమరాంచితభూరిశాఖలన్