Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హేమారంభలైన వారవిలాసినులు కన్దర్పసమానసున్ద
రుండైన యీ ధరణీతరుణీపురన్దరున కెనయైన సున్దరపురు
షుం డెవ్వండును లేడని చూపుకైవడి హస్తంబుల నభినయిం
పుచు, ముఖలోఛనభ్రూవిన్యాసంబుల భావార్థంబు దెలుపుచు
లాస్యంబు సలుప, వన్దిమాగధపాఠకు లందంద కైవారంబులు
సేయఁ బణవకాహళమర్దళవేణుప్రముఖచతుర్విధవాద్యం
బులు బోరుకొనఁగ, ననన్తవైభవాభిరంజితుండై పేరోలగం
బున నుండి.

24

కావ్యకరణహేతువు

మ.

నను శ్రీరామపదారవిన్దభజనానన్దప్రపూర్ణాత్ముఁ ద
ద్ఘననామస్మరణాతిపూతరసనుం దద్భూరికారుణ్యల
బ్ధనితాన్తోజ్జ్వలసత్కవిత్వమహితు న్ధాత్రీసురగ్రామణిం
బ్రణుతప్రజ్ఞుని వేంకటాఖ్యసుకవిన్ రావించి పల్కెం గృపన్.

25


సీ.

గరిమ రామాయణకావ్యరాజము నాన్ధ్ర
                        కావ్యంబుఁ జేసిన ఘనుఁడ వీవు
బ్రహ్మకైవర్తపురాణంబులోఁ గృష్ణ
                        జన్మఖణ్డంబును జారుఫణితి
నాన్ధ్రభాష రచించినట్టి పుణ్యుండవు
                        మహితసర్వజ్ఞకుమారయాచ
విభుని మాతండ్రిని వేమాఱు బహుసంస్కృ
                        తాన్ధ్రసత్కృతులచే నఞ్చితముగఁ


గీ.

బూని మెప్పించి యమ్మహీజానికరుణ
నభినవామ్బరహారాగ్రహారహేమ
వలయముఖ్యసత్కారంబు వడసి వినుతి
కెక్కినాఁడ వాస్థానకవీంద్రుఁ డనఁగ.

26


వ.

కావున మాఘకవికృతశిశుపాలవధాఖ్యమహాకావ్యంబు
సమస్తకావ్యరాజంబై, సర్వాలంకారశోభితంబై నానావిధ
వర్ణనాపూర్ణంబై, శ్రీకృష్ణనాయకం బగుటం జేసి భవ్యంబై,
సర్వజనసేవ్యంబై, పండితజనశ్రావ్యంబై యున్నది. కావున
నక్కావ్యంబు మదఙ్కింతంబుఁ జేసి, యన్ధ్రకావ్యంబుగా
రచింపుమని యానతిచ్చి, జాంబూనదాంబరహారాగ్రహారాది
ప్రదానంబుల సంతుష్టునిం జేసిన, నేను సంతుష్టాంతరంగుండనై
యమ్మహాకావ్యరచనాభిముఖ్యంబు వహించి, కృతిపతివంశా
వతారం బభివర్ణించెద.

27