Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విలసదశోకపుష్పము విభిన్నవియోగవతీవిశాలహృ
త్కలితమనోజబాణశిఖిగాఢశిఖాకపిశీకృతస్ఫుటో
జ్జ్వలపిశితంబు చందమున వావిరిఁ జూడఁగ నయ్యె నెంతయున్.

7


క.

సురసాలరజఃకణములు
స్మరవహ్నితుషాగ్నిచూర్ణసమతఁ గనిన వై
ఖరి వెసఁ బాంధజనులపైఁ
బరిపతితములై యొనర్చె బరితాపంబున్.

8


క.

పతులపయిఁ గుపితలైన యు
వతుల యలుక దీఱ్ప మరుఁడు పంపె నన మధు
వ్రతపాళి వెడలె వకుళ
క్షితిజసుమమరందపానకృతనిస్వనమై.

9


చ.

గురుశరమత్సరచ్ఛిదురకోమలవాక్సరపుష్టకాంతచే
గిఱికొని చెంగటన్ బ్రియసఖీసదృశం బగునట్లు పథ్యమున్
గర ముపదిష్టులై సురతకాంక్షమెయిన్ బ్రియులైన వారికిన్
వరుస నయాచితం బయిన వర్ష మొసంగిరి కామినీమణుల్.

10


గీ.

పరఁగ నళులచే నపవాదకరులచేతఁ
బోలెఁ బథికులు మృగముల లీల మధుర
వల్లకీస్వరఙిద్గీత వైభవమున
నలరి స్మృతిభూవశంగత లైరి యపుడు.

11


చ.

చెలువుగ నొక్కయిందుముఖి వేఁ గుసుమాపచయార్థ మింపుసొం
పలర రసాతిరేకమున నట్లవలంబిత మయ్యు సంభ్రమం
బొలయ వనాగమున్ వశత నొందని దౌట వృధోన్నకాకృతిన్
జెలఁగి యసత్యపుంస్త్వమునఁ జెన్ను వహింపకయుండె నత్తఱిన్.

12


వ.

మఱియు నొక్కపురుషుండు స్వయంగ్రహాశ్లేషసుఖంబు కొఱకుఁ
బ్రియురాలి నళిపాతవ్యాజంబున భర్త్సింపుచు నిట్లనియె.

13


సీ.

స్తనయుగ్మభరవిజితస్తబకానమ
                        త్ప్రత్యగ్రవల్లీవిరాగియైన
యీ మధువ్రతకులం బెలమిఁ బరాగవం
                        తములైన నవపంకజములు విడిచి
మునుకొని నీ కభిముఖముగాఁ జరియింపు
                        చున్నది సమ్మోదయుక్త మగుచు
భవదీయసురభినిశ్వసితమందును సుధా
                        రమణీయమధురాధరంబునందుఁ