Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

విలసత్సైన్యవినద్ధమై కుధర మొప్పెన్ దంతిభగ్నద్రుమా
వళిశబ్దంబులఁ గృష్ణ! నీవు నలువొప్పన్ బర్వతోద్ధర్త వం
చిలఁ బ్రఖ్యాతి వహించినాఁడ విపు డిట్లేలా ననుం గిన్క నా
కులపా టొందఁగఁజేసె? దంచు వెస నాక్రోశించుచందంబునన్.

433


ఉ.

సౌరమహీద్రధీర! సురసన్నుతశౌర్యవిహార! వార్ధిగం
భీర! మదోద్ధతారిగణభేదనదక్షభుజప్రచార! గో
త్రారికుమారమార! ఋతురాజమనోజ్ఞశరీర! సద్యశః
పూరితలోకవార! గుణపుంజవిభూషణ! మంజుభాషణా!

434


క.

నారాయణాంశభవ! సుగు
ణారామవసంత! వితరణామరభూజా!
సూరిజనస్తుతమదనా
కారా! గోపాలకృష్ణకరుణోదారా!

435


మాలిని.

పరహితసుచరిత్రా! పండితశ్రీపాత్రా!
తరణిసదృశతేజా! దండితద్విట్సమాజా!
పరిచితబహువిద్యా! భవ్యసౌందర్యహృద్యా!
నిరుపమగుణజాలా! నిత్యకళ్యాణశీలా!

436


(గద్య)

ఇది శ్రీరామచంద్రకరుణాకటాక్షలబ్ధవిద్యాసాంద్ర గోపీ
నాథ వేంకటకవీంద్రప్రణీతంబైన శిశుపాలవధమహాకావ్యంబు
నందు నారదాగమనంబును శ్రీకృష్ణసందర్శనంబును హిరణ్య
కశిపుదశగ్రీవప్రభావవర్ణనంబును శిశుపాలవధపూర్వకంబై
న శక్రసందేశంబు నారదుం డెఱింగించుటయు నుద్ధవబలరామ
సమేతుండై కృష్ణుండు మంత్రంబు గావించుటయు నింద్రప్రస్థ
యానంబును రైవతకపర్వతవర్ణనంబును రైవతకాద్రిప్రవే
శంబును గజరథహయాదివర్ణనంబును నను కథలం గల
ప్రథమాశ్వాసము సంపూర్ణము. శ్రీకృష్ణ.