Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

పరఁగ సముత్తీర్ణబాహ్యధూర్లఘువయ్యు
                        భూరిబల్బజతృణపూర్తివలన
నతిదుస్సహంబైన యౌక్షకం జగముల
                        క్రింది లోమంధక మంద నంచ
లద్గురుసాన్నమై లక్షింప ముకుళీకృ
                        తాలసాక్షులు గల్గునట్లు ప్రీతి
నివసించె మఱియుఁ గొన్నివృషంబు లఱుచుచుఁ
                        గిలితమృత్పిండశేఖరితకోటు


గీ.

లగుటఁ గోట్యంతరగతాంకుఁ డైన యర్థ
కమలవైరిని గేరు శృంగములచేత
సంతతోచ్ఛృంగితాన్యవృషంబు లగుచుఁ
దటిని తీరంబు గోరాడే దర్ప మెసఁగ.

427


మ.

తగ నూర్జస్వల మైన యొక్కవృష ముద్యచ్ఛక్తిచే మాంసలో
పగతాభీకపరోక్షసంచయములం బల్మాఱు నిర్జించి జ
న్యగతానూనజయోద్ధురాయవిషాణోగ్రంబులుం గల్గున
ట్లు గజారివ్రజమై తమిం జనియె గోలోకంబు వెంటన్ రహిన్.

428


మ.

సముదగ్రానన మామితావ్యధమహోచ్ఛగ్రీవమై చూడనొ
ప్పుమహోష్ట్రవ్రజనుభ్రచుంబ్యభినవప్రోద్యద్ఘనాస్వాదవం
తములౌ మంజులపల్లవప్రచయముల్ దత్పర్వతాధిత్యకా
ద్రుమజాలంబులమీఁదనుండి తిగిచెన్ లోలోష్ఠముల్ గల్గఁగన్.

429


గీ.

మఱియు నొకయుష్ట్ర ముచితనింబచ్ఛదప్ర
విష్టమృదులామ్రపత్రంబు వెడలఁగ్రక్కె
మున్నుగరుడుండు మ్లేచ్ఛసమూహమిశ్ర
గళగతమహీసుపర్వునిఁ గ్రక్కినట్లు.

430


ఆ.

వె. బయలనున్న భృత్యపాళితో రాజుల
వార్త లెఱుగఁ బల్కు పాఠకులును
విపులఫణితిఁ బ్రకటితపదార్థ మౌనట్లు
పాడి రవసరప్రబంధతతుల.

431


ఉ.

ఉన్నతధాతురాగవిపులోచ్ఛ్రితవస్త్రకుటీరయుక్త మై
పన్నుగ నంజనాభగజభాసిత మై ఘనసాంధ్యరాగసం
భిన్నపయోదకర్బురితవిశ్రుతచారునభంబుకైవడిన్
సన్నుతలీల నొప్పె హరిసద్మము భూరిమనోహరాకృతిన్.

432