Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కంబుమాడ్కి బుధకవిగురుసేవితంబై యిన్ద్రలోకంబుచందం
బున నందం బగుచున్నసభాసదనంబు ప్రవేశించి భరతలక్ష్మణ
శత్రుఘ్నసహితుండైన రామభద్రునివైఖరి ముద్దుకృష్ణ
యాచేన్ద్ర వేంకటకృష్ణయాచేన్ద్ర వేణుగోపాలకృష్ణయాచేన్ద్ర
నామంబులఁ బ్రసిద్దులైన యనుజన్ములు మువ్వురతోడం గూడి
యనర్ఘరత్నఖచితసువర్ణపీఠంబుమీఁద సుఖాసీనుండై తత్ర
త్యమహేన్ద్రమణిమయస్తమ్భాగ్రనిర్మితరత్నపాఞ్చాలికలు
కరతలఘటితసువర్ణపాత్రాన్తరాళస్థితపద్మరాగమణిదీపికల
నివాళింప నుభయపార్శ్వస్తమ్భనిబద్ధసాలభఞ్జికలు మణి
దణ్డమణ్డితతుషారకిరణకరపుఞ్జసఙ్కాశచారుచామరంబులు
వీవ ఘ్రాణతృప్తికరంబులైన సాంబ్రాణియగరుల ధూపవాస
నలు సభాసదనంబునిండ గుబాళింపఁ బురోభాగంబున నపార
శబ్దశాస్త్రపారావారపారంగతులైన వైయాకరణులును,
బరస్పరజిగీషాయత్తచిత్తులై హేతువాదంబులు సేయు
తార్కికులును, వేదవ్యాసకృతబ్రహ్మసూత్రవాక్యార్థోప
న్యాసంబునఁ దర్కకర్కశోక్తులకు మార్దవంబుఁ బుట్టించు
శారీరకమీమాంసకులును, గావ్యనాటకాలంకారశాస్త్రజ్ఞు
లైన యాలంకారికులును, జతుర్విధకవితానిర్వాహకమహా
ప్రబంధనిర్మాణచతురులగు మహాకవులు మొదలగు సకలవిద్వ
జ్జమలు తమతమవిద్యావైదుష్యంబుఁ జూపుచు నుచితాస
నంబుల నుండి పరివేష్టింప మన్త్రిసామన్తపురోహితబాన్ధవ
సంఘంబులును బలే అద్మీలును నర్హస్థానంబుల నుండి సేవింపఁ,
గంచుకోష్ణీషధరులై చారుచామీకరవేత్రంబులు కరంబులం
బూని నకీబులు చోపుదార్లు బరాబరులు సేయ గానవిద్యాధరీ
కృతవిశ్వావసుప్రముఖదేవగంధర్వులైన వైణికులు మనో
హరంబుగాఁ గాలానుకూలరాగపంపద లేర్పడ గ్రామమూర్ఛ
నాకంపనాదులు దెలుపుచు గాన్ధర్వంబు గావింప ముఖవాసా
లోచనగాత్రోరుతిరస్కృతచన్ద్రరేఖాతిలోత్తమాహరిణీ