Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్వనమై విస్తృతపదమూల మగుచున్ షట్పాదసంఘంబు గ్ర
న్నన భాసిల్లె గుణంబు ద్రవ్యగతమైనన్ స్వాశ్రయం బర్థిఁ బా
సిన తద్వారణనీలవర్ణముక్రియన్ జీమూతతుల్యద్యుతిన్.

405


చ.

ఘనగజగాత్రలగ్నబహుగైరికధాతుపరాగరాగమున్
ధునిపయిఁ బర్వఁ దద్వికచతోయజగర్భహరిత్పరాగమున్
ఘనకరిమీఁదఁ బర్వఁ జిరకాలము క్రీడ యొనర్చి వస్త్రముల్
మునుకొని మాఱ్చికొన్నక్రియఁ బొల్చె నుదత్తటినీమహేభముల్.

406


చ.

ద్విరదములుం జలోపరినివిష్టమదోదకచంద్రకంబులన్
వరుప మహాసరిత్తులకు వారక నేపృథునేత్రసంపదన్
గర మొనఁ గూర్చె దానినె వనంబులఁ బాసి తటంబుఁ జేరుచున్
మరల గ్రహించె గాత్రగతమంజునవోత్పలపత్రకంబులన్.

407


ఉ.

వితతశితాంకుశప్రబలభిన్నవిశాలకపోలనిస్సరత్
క్షతరుహమయ్యు రోషమునఁ జయ్యన నవ్యగజంబుమీఁదికిన్
జతురత నేగుదంతిని నిషాది మరల్పఁగఁ జాలఁ డయ్యె; ను
ద్ధతి బలవంతుఁ డన్యులకుఁ ధారుణి లోఁబడురే? తలంపఁగన్.

408


ఉ.

సానునయంబుగా నొకనిషాది గజంబును బంధనార్థమై
పూనిక సేవ్యమైన తరుమూలము సేర్చిన నన్యదంతి రా
డ్ధానకృతాధివాసమగు దాని భజింపక త్రుంచి వైచె; బల్
మానులు వైరిగంధ లవమాత్రమునైన సహింతురే? భువిన్.

409


ఉ.

సంతతశైలకుంజచరసామజరాజకపోలకాషసం
క్రాంతమదోదకం బగుట రమ్యచమూగజభగ్నమైన వృ
క్షాంతమునందుఁ గ్రాలెడులతాంతములన్నియు వాడెఁ దుమ్మెదల్
పంతము మాని నిస్పృహత వచ్చినత్రోవనె పోయెఁ గ్రమ్మరన్.

410


ఉ.

ఎప్పుడు దంతు లున్నతమహీరుహమూలములన్ వసింపఁ బో