Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నం బఱచునెడ వేరొక్కపురుషుండు వారినందరిని వారించి దాని
రక్షించి మహోత్కర్షంబు నధిగమించె; నప్పుడు.

392


మ.

జనసందర్శనభీతిచే వసనవేశ్మస్థానమధ్యంబునన్
ఘనశక్తిం బరువెత్తు లేడి శరభృత్కాండఁబుచేఁ జిక్కు నొం
దని దయ్యున్ వదవాంతరస్థలలనోద్యత్కర్ణవిశ్రాంతశో
భననేత్రేషుహతాక్షిలక్ష్మియయి నిల్వంజూడ దెప్పట్టునన్.

393


సీ.

 వితతలావణ్యనిర్జితదేవవేశ్యలు
                        నరమానసాకర్షణస్వభావ
లుచితనర్మవచోభిరచనాచమత్కృతుల్
                        వేశ్యలు సైన్యంబు విడియు నంత
రమ్యావసధములు రచియింపఁగాఁ బంచి
                        లలితప్రసూనతల్పము లమర్చి
మార్గభేదంబును మదిఁ దలపోయక
                        సింగార మొనరించి చెలువు దాల్చి


గీ.

యలసి చనుదెంచు పురుషుల వలచి తెచ్చి
రమణతోడ శైత్యోపచారము లొనర్చి
పరఁగఁ జిరసన్నివిష్టల కరణి వారి
చిత్తములఁ బ్రీతి రంజిల్లఁ జేసి రపుడు.

394


గీ.

జలము ద్రావి క్రుంకులు వెట్టి జలజములు ధ
రించి తూండ్లు భుజించి వారించి రఖిల
జనులు శైలసరిత్సంపద నుపభోగ
నిష్ఫలత్వదోషోద్భూతనింద నపుడు.

395


చ.

అతివల నిమ్ననాభిసలిలాశయభిన్నరయంబులుం దదం
చితవిలసద్బృహజ్జఘనసేతునివారితముల్ నదత్సుసం
భృతజలమండుకాఖ్యపటవిశ్రుతవాద్యమనోజ్ఞసంచల
త్తతకుచవిచ్యుతంబులగు తజ్జలముల్ ప్రవహించె మందతన్.

396


చ.

మసలకహాస్తికంబులు సమగ్రవిలోలకరాగ్రరంధ్రకో
ల్లసితజలప్రవృష్టి నవిలంఘితభూరిపథశ్రమాయత
శ్వసితమరున్నిరప్తసువిశాలశిరోభవశుభ్రరుగ్మణా
విసరముచేతఁ బోలెఁ గడు వేడుకఁ జల్లుకొనెన్ శరీరమున్.

397


ఉ.

ఎయ్యవి పక్షముల్ గలిగి యేపున వారిధిలో మునింగె ము