Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

నళినాక్షుం డిటు లవ్యళీకములు గాంతాసమ్మితంబుల్ నిజం
బులు నై రాజిలు సూతపుత్రువచనంబుల్ ప్రీతి నాలించి యు
త్కలికం దద్వచనాంతమందు వనరేఖాచేలసంఛాదితో
జ్జ్వలమౌ రైవతకాద్రియందు విహరింపం గోరెఁ జిత్తంబునన్.

370


మ.

కనదుత్తుంగనభస్స్పృశత్కదళికాకాంతారరేఖాక్తమ
బ్ధినిభంబౌ యదుసైన్యసంఘము దగన్ విస్తారసంఛాదితా
పని యౌటం బ్రతిశైలలక్ష్మి నను వొప్పన్ దాల్చి దంతావళేం
ద్రనికాశాతులతుంగశృంగిగిరి కందం బొప్ప నేగెన్ రహిన్.

371


చ.

అమితచమూసముత్థరుచిరాభ్రవికాసిమహోష్ట్రకంఠపిం
గమగు మహీపరాగమినకమ్రకరాప్తివికాసితాంబరాం
తము లగుటన్ మహాజననిదర్శనసంభవలజ్జ నొంది న
ట్లమరి చెలంగు నట్టి హరి దంగనలన్ వడిఁ గప్పె సాంద్రమై.

372


చ.

సురుచిరచారుదేవమణిశోభితముల్ భృతరంధ్రభాగముల్
భరితమహోర్మిజాలములు భవ్యఫలప్రదశుక్తియుక్తముల్
గురుతరరోచమానము లకుంఠితసద్భ్రమపూరితంబులై
వఱలు హయంబు లంబుధులవైఖరి మేదినిఁ గప్పె గ్రక్కునన్.

373


గీ.

మార్గమందు శితారక్షమగ్నసృణిని
సరకుగొన కార్తి నఱచుచు నుఱికె నిభము;
లొట్టియ నిరస్తభారమై మిట్టిపడియె;
నొండొరులచేఁతఁ జూచి యా రెండు వెఱచె.

374


చ.

అతిచటులాగ్రపాద మగు నట్లు వడిం జను చారుచామరాం
చితహయరాజమున్ మదవిశేషసలీలనిమీలితాక్ష మై
చతురత మెల్లనం జను గజంబును గాంచె జనంబు; సాభిలా
షత ననురూపచేష్టమయి సర్వముఁ బ్రీతికరంబె కాదొకో?

375


చ.

కరి నటు గాంచి భీతి నొకగర్దభ మానన మెత్తి కూయుచుం