| |
మురుధారమగు జల మూర్ధ్వప్రసారిత
హరిధనుస్సుందరం బగుచు నొప్పె;
జెలు వొప్ప నీశైలశిఖరశిఖావళుల్
ప్రవిలసచ్చిత్రకల్పక్షమాజ
|
|
| గీ. |
పుష్పపరిగుంభితములైన పోల్కి నలరు
మహితపరిలంబిపింఛదామంబులైన
చారుశిఖిశేఖరంబులు క్షణము దాల్చు
చున్న యవి చూడు మంతట! నుత్సవమున.
| 354
|
| క. |
వినుఁ డిట సవధూకులు సఖు
లనవరత మమందరాగతామరసదృశుల్
ఘనరసవన్నవరతి గ్ర
ద్దన సలిపి రమందరాగతామరసదృశుల్.
| 355
|
| చ. |
పొలుపుగఁ గట్టు పుష్పపటముం దగఁ గప్పి తదంతరభ్రమ
త్కలితకపోతకంఠతులితస్ఫురితాగరుధూమకాంతిభృ
ల్లలితవినూత్నమేఘపటలంబులచేత నిజాంగకావళిం
గలయఁగ ధూపవాసితముగా నొనరించెడు భంగి దోఁచెడిన్.
| 356
|
{{Telugu poem|type=శా.|lines=
అత్రస్యన్నవరత్నసంభవసమగ్రాన్యోన్యమిశ్రోజ్జ్వల
చ్చిత్రాకారమయూఖకల్పితనభస్సీమాగ్రనిర్భిత్తిహృ
చ్చిత్రప్రాపణచిత్రకర్మ మెపుడున్ సిద్ధామరశ్రేణికిన్
జిత్రంబుం గలిగించె నీయవనిభృచ్ఛేష్ఠంబు నీక్షించితే!
|ref=357}
| గీ. |
వాయుశిశిరమై శిఖరనివాసు లైన
యలఘుసుఖులకుఁ బుణ్యవంతులకు ముదము
గలుగఁ జేయుచు నీగట్టు జలవియోగ
ధవళఘనపఙ్క్తి యవనికల్ దాల్చెఁ గంటె!
| 358
|
| వ. |
మఱియు నిమ్మహాశైలంబునందు సమాధినిష్ఠులగు యోగులు
మైత్రియుఁ గరుణయు ననుమోదనంబును నుపేక్షయు నమ
సంజ్ఞలుంగల చతుర్విధచిత్తవృత్తు లెఱింగినవార లగుటం జేసి
క్షీణాంతఃకరణమాలిన్యు లై యవిద్యయు నహంకారంబును
రాగంబును ద్వేషంబు నభినివేశం బనంబడు పంచవిధక్లేశంబుల
నుపసంహరించి సంలబ్ధసాలంబనధ్యాను లగుచుఁ బ్రకృతి పురు
|
|