Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మఱియు నిమ్మహాశైలంబు ధారణాసమర్థుండైన బ్రాహ్మ
ణునికరణి నాగమప్రధానులును నిధిమంత్రసాధనవిశేషవిశార
దులు నగువారిచేత బహుప్రయత్నంబునఁ బ్రకాశింపంబడిన
దాని ననిశ్చితబుద్ధులైన యశాస్త్రజ్ఞులచేత వినియును దుస్సా
ధనం బగుదాని నఘంబు నడంచుటకు సమర్థంబైన నిధి
మంత్రగణంబును ధరింపుచున్న; దదియునుం గాక.

343


మ.

ప్రతతానంతతమాలతాల మగుచున్ రాజిల్లునే యీపురో
గతభాస్వద్వన మొప్పె; నట్టి స్థగితార్కప్రోల్లసద్రశ్మిసం
తతియున్ రంజదనంతతానమగు నీ, దానంబునం దేల తా
ప్రతతు ల్చారుఫలప్రసూనయుతముల్ గాకుండు నెవ్వేళలన్.

345


మ.

ఘనదంతోజ్జ్వలరత్నచిత్రకటకాక్రాంతంబులై యొప్పు ర
మ్యనగాధిత్యకలందు నిర్మలశిలోద్యన్మేఖలల్ భూరిచా
రునితంబల్ కమనీయకోమలనభోరుగ్గండశైలల్ నితం
బిను లిచ్ఛాసదృశాధివాసమును నెమ్మిం బొంది రీక్షింపుఁడీ!

346


గీ.

చటులవిరళవికీర్ణవజ్రకణయైన
ధౌతరజతోర్విజలదసద్యఃప్రముక్త
బహుచిరస్థాయిబుద్బుదాంభస్సమగ్ర
సామ్యమును బొందుచున్న దీశైలమందు!

347


వ.

మఱియు నిమ్మహీధరం బేకాంతంబున సంగమం బగుచుండ
విస్రంభవిహారంబు కాక్షింపుచున్నవా రగుటం జేసి జనసంగంబు
వర్ణించి మన్మథునిచేత సంప్రాప్తజ్వరాంగులై కుంఠితనేత్రాం
తలై యున్న యనేకయోషలచేత సేవింపంబడుచున్న
దదియునుంగాక.

348