Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అరుణవిభావిభిన్నరుచు లైన దినేశతురంగమంబు లే
ధరణిధరంబుమీఁద సముదంచితవంశకరీరనీలసుం
దరతరజాతీరత్నకలితస్ఫురతుచ్ఛతరాగ్ర్యదీధితి
చ్ఛురితములై స్వవర్ణమును సొంపుగఁ గ్రమ్మఱఁ దాల్చెఁ బల్విడిన్.

322


గీ.

ఉరుసముత్పతదభ్రసముజ్ఝితాంబు
సిక్తమగు నవిపన్నగాశేషవృక్ష
వనమును విషానలోద్భూతఘనవిపత్తి
సంతతము నెందు బాధింపఁ జాలదయ్యె.

323


ఉ.

పంతముతోడ నే శిఖరి భాస్కరభూరికరాప్తిహవ్యభు
క్కాంతులు గ్రక్కు సూర్యమణికాంతులపాత్రగుణాశ్రయంబుచే
సంతతమున్ బ్రసిద్ధగుణసంక్రమణంబును బొల్పు మీఱ పం
క్రాంతగుణాతిరేకమును గానొనరించె మహాద్భుతంబుగన్.

324


ఉ.

ఆవసుధాధరంబు ముదమారఁగ మున్నటు పెక్కుమాఱు లి
చ్ఛావిధి దృష్ట మైనను బ్రసన్నత శౌరి కపూర్వవిస్మయం
బావహిలంగఁ జేసెఁ; బ్రతియామము నందు నవత్వ మొందుటే
వావిరి రామణీయగుణవైభవయుక్తికి లక్షణం బిలన్.

325


ఆ.

అంత యుక్తికుశలుఁ డైని దారకుఁడు న
దత్పతత్రినికరతటులు దాల్చి
నట్టి నగవిలోకనాశచే నుద్గ్రీవుఁ
డైన శౌరి కిట్టులనుచుఁ బలికె.

326


గీ.

ఘనసినద్దదిగంబరాక్రాంతభూరి
శృంగగోతలమూర్ధస్థశిశిరకిరణ
నవ్యకోటి గిరీశసందర్శనమున
నెవ్వని మనంబు భువి విస్మయింపకుండు?

327


గీ.

సుభగవితతోర్ధ్వరశ్మిపాశు లగు శశిధ
రోష్ణకరు లుదయాస్తంబు లొందుచుండ
నీయగంబు విలంబిఘంటాయుగపరి
వృతమదావళలీల వహించె, నధిప!

328


గీ.

అధిప! లసమానచారునవాంశుక మగు
ధరము సహరితకాంచనస్థలులు దాల్చి
ప్రకటహరితాళనూతనాంశుకుఁడ వైన
నీ పగిది నొప్పుచున్నది నేఁడు కంటె!

329


మ.

అనిశం బీ నగరాజసానువులయం దాసక్తితోనున్నయీ
జనముల్ శాంతమలాతిసాంద్రకరసంచారంబు సంపూర్ణల