Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

నీలలోహితగజదాననీరమిళిత
బర్హిబర్హచూర్ణద్యుతి భాక్సువర్ణ
మహిపరాగంబు లానేమిమగ్నరథవి
తానములచేతఁ బిండీకృతంబు లయ్యె.

258


గీ.

పాదహత మయ్యుఁ గనకభూపాంసుతతి మ
హాజనశిరంబులను దాఁట దయ్యె; మఱియు
నేపు మీఱ నౌద్ధత్యంబుఁ జూప దయ్యె
గరిమ కనురూప మగు నట్లుగాఁ జలించె.

259


సీ.

హయములు భూరివల్గాకర్షణంబుల
                        నధికయత్నంబున నపుడు సాది
లోకంబుచేత నిరుధ్యమానము లయ్యు
                        సారెసారెకు నగ్రచరణములను
బరువడి నెత్తుచుఁ దెరు వాగి మెల్లనఁ
                        జనుచున్న గురుమత్తసామజముల
దాఁటి పోవఁగ నిచ్చదలఁచిన కైవడి
                        నతివేగమున నిల్వ కరుగుచుండె


గీ.

నధికయత్ననిరుద్ధాశ్వులైన తురగి
గణముచేఁ జూడఁబడుచు మార్గంబునందుఁ
బాంసుసంక్రీడఁ గావించు బాలకులను
గొనిచనిరి వేగ నిండ్లకు జనను లపుడు.

260


గీ.

కృష్ణు నకలంకచిత్తు వీక్షించు వేడ్కఁ
బురజనులు వీథివీథికిఁ బఱచి రపుడు;
సారె కటు సంస్తవం బగు జనము నైనఁ
గోరి సాంద్రతరప్రీతిఁ గ్రొత్త సేయు.

261


చ.

పరఁగ నభిజ్ఞుఁడైన మురవైరి పురీవరదత్తనేత్రుఁ డై
వరుస నిరంతరోగ్రయదువాహినిచేఁ గడుసంకటస్థితిన్
బరఁగెడు రాజమార్గమున బాగుగ నేగెడు తచ్ఛతాంగసుం
దరతరమందమందగమనంబు నెఱుంగక యుండె నత్తఱిన్.

262


చ.

జలనిధిమధ్యదేశమునఁ జారుసువర్ణవిశాలసాలశో
భల సకలాశలం గపిశవర్ణయుతంబులుగా నొనర్చుచున్
బొలుపుగ నప్పురం బలరెఁ బుష్కరభేద మొనర్చి మీఁది కు
జ్జ్వలగతి నిర్గమించిన లసద్బడబానలహేతికైవడిన్.

263