Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

హితవిబుద్ధమంద్రాంబుధహృద్యనాద
మచ్యుతార్ణవాభ్యర్ణచరైకహంస
మలసవాతప్రపూరణోద్యన్నినాద
ధారియగు పాంచజన్యాఖ్యదరము దోఁచె.

251


గీ.

అరయ నన్యునిచేత నొకప్పుడైన
నతనిఁ బొందక క్రియయందు శ్రుతి సమీప
కలితగుణ మై విధేయ మై యలరునట్టి
శార్ఙ్గము సమీపగత మయ్యె సఖునికరణి.

252


వ.

ఇట్లు సర్వాలంకారశోభితుండును సర్వాయుధ పరిష్కృ
తుండును నై.

253

ఇంద్రప్రస్థయానము

ఉ.

ఆదర మొప్పఁ గృష్ణుఁడు రయంబున సంతత మిష్టసిద్ధి సం
పాదకమున్ మనోజ్ఞము సమస్తదిగప్రతిషిద్ధమార్గమై
భూధరలీల నొప్పెసఁగు పుష్యరథం బవలీల నెక్కె నా
హ్లాద మెలర్పఁ బుష్యరథుఁడైన శశాంకుక్రియన్ వెలుంగుచున్.

254


చ.

హరిరథకేతనాగ్రఘటితాంబరధాముఁడు పన్నగారి భా
స్వరతరరత్నసంఘటితచారుమహీప్రతిబింబితాంగుఁ డై
తిరముగ నాశుగాశనతతిన్ వెఱపింప రసాతలం బవా
ర్యరయమునం జొరం దలఁచినట్లు గనుఁగొననయ్యె నయ్యెడిన్.

255


చ.

హరి యిటు సంభ్రమంబునఁ బ్రయాణము సేయు తఱిన్ మహామహీ
ధరవిలసద్గుహాదళనదక్షబృహత్పటహస్వనంబు ల
బ్బురముగ వారిరాశిజలపూరము లన్యజలంబులం బలెం
బరువడి నన్యశబ్దముల బాగుగ మ్రింగి సెలంగె నెంతయున్.

256


వ.

మఱియుఁ గుక్షినిక్షిప్తాఖిలలోకుండైన వాసుదేవుఁ డేభాగం
బునకుం జనియె నాభాగంబున ధరణీధరుండైన శేషుండు మహా
భారకుబ్జీభూతశిరస్సహస్రసహాయకర్మత్వరమాణభుజంబులు
గలుగునట్లుగాఁ బ్రవర్తించెఁ; బదంపడి యత్యున్నతద్వార
దారుసంగభంగసాధ్వసావనమ్రీకృతకేతనంబు లైన యదుసైన్యం
బులు నీతిమంతుండైన మహీపతిని సామాద్యుపాయప్రయో
గఫలంబు లైన హిరణ్యభూమికాదిలాభంబులుఁబోలె సోమా
న్వయుం డైనకృష్ణుని వెనుకొని యరిగె నప్పుడు.

257