Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

ఘనకవాటవిశాలవక్షస్థరముఁడు
హరికి సమ్మోదితాశేషనరయు సర్వ
గాత్రసంగిని యగుట విచిత్రభంగి
నయ్యలంకారరమ చాల నధిక యయ్యె.

245


గీ.

కమ్రతరభూషణత్వభృత్కనకకశివు
ప్రాణహారిలసన్నఖవ్రణప్రకాశ
కఠినతాగుణవక్షోజకలిత లైన
వెలఁదు లయ్యాదవేంద్రు సేవించి రపుడు.

246


గీ.

పరఁగ నత్యున్నతత్వంబువలన మీఁది
కొనర నాకృష్టమైన యట్లున్న యువతి
మహితకుచభారమునఁ బీడ్యమాన మగుచు
నతికృశంబైన నడుము నమ్రత వహించె.

247


శా.

ఏయే కామిని వంకఁ గన్గొనియె శ్రీకృష్ణుండు సంప్రీతితో
నాయాకామిని మోము వాంచె ఘనలజ్జాలోలదృక్పద్మ యై
యేయే కాంతలవంకఁ జూడఁ డపు డాహేలావతు ల్సంభృతా
సూయన్ వేఁ బ్రహరించి రయ్యదుపతిన్ కుంభత్కటాక్షంబులన్.

248


మ.

అతసీసూన సమానకాంతియగు కంసారాతి రమ్యైకహ
స్తతలం బొప్పెఁ బరిభ్రమత్కిరణసంచారోరుచక్రంబుచే
నతులప్రస్ఫురితభ్రమత్పృథుతరైకావర్త మౌ యామునా
యతతోయౌఘము మాడ్కి యాచకజనోద్యత్కల్పభూజాతమై.

249


చ.

విమతనృపాలవిగ్రహవిభేదనదక్ష మనంతసత్వమున్
సముదితతేజమున్ సతతసన్నిహితంబు నమోఘ మైన యు
త్తమగద మూర్తమైన సముదంచితశక్తియుఁ బోలె శౌరి చి
త్తమునకు సమ్మదం బెసఁగఁ దప్పక వేఁ బొడసూపె నత్తఱిన్.

250


సీ.

తలఁప ననన్యసాధారణత్వంబును
                        బొందిన దయ్యు నే నందకంబు
గజహయరథములగతి నసాధారణ
                        స్వత్వంబుచేతనే చక్రపాణి
సంబంధి గా దది సతతంబు పగతుర
                        కుద్వేజకారి యై యుంటఁ జేసి
చంద్రునికైవడిఁ జర్చింప శౌరికే
                        యన్వర్థ నామ మై యలరె నపుడు;