Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్నతవక్షస్స్థలనియతనిషణ్ణలక్ష్మీశ్రుతంబు నగు తదీయవాక్యం
బాలకించి, కృష్ణుండు శీఘ్రంబున నాసనంబు డిగ్గి.

232


మ.

అతులశ్రీదదిగధ్వమున్ విడిచి యయ్యాగస్త్యదిగ్భాగముం
జతురత్వంబునఁ జేరఁ బూనిన సరోజస్వామి చందంబునన్
గతయుద్ధాభినివేశసౌమ్యుఁ డగుచున్ గంజాతపత్రాక్షుఁ డా
తతభంగి న్మది నిశ్చయించె వెస నింద్రప్రస్ధయానం బొగిన్.

233


ఉ.

సర్వజగత్ప్రపూజ్యుఁడగు సారసనేత్రుని మౌళిపై బృహ
త్పార్వణచంద్రతుల్య మయి భాసిలు ఛత్రము పొల్చి నందునన్
సర్వజగత్పవిత్రకరసంభృతపాదములన్ స్పృశింపఁగా
సర్వజగత్ప్రకాశుఁడగు సారసమిత్రుఁడు చాలఁ డెంతయున్.

234


చ.

అరయ మృణాలసూత్రసదృశాచ్ఛచలత్పృథుచామరద్వయాం
తరగతుఁ డై మహేంద్రమణిధాముఁడు చారుసమస్తసద్గుణో
త్తరుఁ డగు యాదవేంద్రుఁ డభితఃపరిపాతుకసిద్ధసింధు వౌ
శరధి యభూతపూర్వవిలసత్పుృథుకాంతి వహించె నత్తఱిన్.

235


మ.

అతులశ్రీయదువర్యమౌళిగతనానానర్ఘభాస్వన్మణీ
వితతానూనవిచిత్రదీధితులచే విఖ్యాతనానావిధాం
చితధాతుచ్ఛురితాశ్మరశ్మి యగుచుం జెల్వొందు రంజత్కరో
ద్యతగోవర్ధనపర్వతం బనుగృతం బయ్యెన్ సమగ్రంబుగన్.

236


మ.

విలసత్కాంచనకుండలాగ్రఘటితస్ఫీతోరు గారుత్మతో
పలచంచత్కమనీయదీధితులచేఁ బద్మావరుం డాతతో
జ్జ్వలబాలోచితనీలకంధరదలద్బర్హావచూడాంచితా
కలనన్ దాల్చినభంగి నొప్పెసఁగె వేడ్కన్ బౌరు లీక్షింపఁగన్.

237


మ.

అలరన్ మందరకూటకోటినికరవ్యాఘట్టనోత్తేజనా
కలితస్ఫీతవిశాలనిర్మలమణీకాండోరుకాంతిచ్ఛటో
జ్జ్వలరంజత్కనకాంగదంబులు జగద్వంద్యున్ రమావల్లభున్
జలజాతాక్షునలంకరించె జనముల్ సంతోషముం జెందఁగన్.

238