Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లలికావ్యనాటకాలంకారసుమనస్స్త
                        బకకల్పశాఖ యెవ్వానివిద్య
యఖిలభాషోక్తశబ్దానుశాసనబిరు
                        దాంకిత మెవ్వానియలఘుకీర్తి


గీ.

యట్టి వళ్మీకసంభవవ్యాసకాళి
దాసనన్నపార్యులను బ్రార్థన యొనర్చి
మఱియు సంస్కృతసత్కవివరుల నాంధ్ర
సత్కవీంద్రుల మదిలోన సంస్మరింతు.

9


వ.

ఇట్లు సకలదేవతాప్రార్థనంబును సత్కవిజనాభినందనంబుమ
గావించి యుదంచితమందారకుసుమనిష్యందమకరందబిందు
పేశలసుందరశబ్దప్రపంచసంచితంబును సకలవిద్వజ్జనశ్రావ్యం
బును సర్వాలంకారరసవర్ణనాపూర్ణంబు నగు నొక్కయాంధ్ర
కావ్యంబు రచియింపంబూని యున్నసమయంబున.

10

వేంకటగిరిపురీవర్ణనము

చ.

నటితహరిజ్జయేందిరకు నాటకరంగ మనంతవైభవో
త్కటమున కాలవాలము తతస్ఫుటవిద్యల కాటపట్టు ను
దృటభటసింహకోటులకు ధర్మమహీధరగహ్వరంబు వేం
కటగిరిపట్టణం బలరుఁ గాంతిజితామరరాజధానియై.

11


సీ.

అచటి మహీసురు లతికళాధారులై
                        ద్విజరాజు లనఁ జాలవినుతి గాంతు
రచటి రాజవరేణ్యు లరిబలహంతలై
                        జిష్ణు లనంగఁ బ్రసిద్ధి గాంతు
రచటి యూరుజులు పుణ్యజనైకపాలురై
                        క్షితి శ్రీదు లనఁగ విశ్రుతి వహింతు
రచటి శూద్రులు కుజనావనదక్షులై
                        కుజనారి యగు బలుఁ గుత్స సేతు


గీ.

రచటి వెలయాండ్రు సక్థినాసాక్షి గాత్ర
హసితరంభాతిలోత్తమాహరిణిహేమ
లగుచు విశ్రుతి గాంతు రన్నగరికి సరి
గాఁ దగునె యక్షరాడలకాపురంబు.

12


సీ.

కరములు సాఁచి నాకధునీవరాంబువుల్
                        తమి దీరఁ ద్రావు దంతావళములు
రయరూపవర్ణవిభ్రాసితఘనసుధా
                        సింధుజంబులు మహాసైంధవములు
కేతనపటజాతవాతరుద్ధదినేశ
                        పథములు కమనీయబహురథములు
బలుసింగములఁ బట్టి పైనెక్కి విచ్చల
                        విడి సంచరించు బల్వీరభటులు