Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

బాంధవుఁ డైన యా పాండవుం డతిభర
                        క్షమఘనస్కంధుని సఖుని నిన్ను
బాపటగాఁ గొని బహుయాగభారంబు
                        నిర్వహించుటకుఁ దా నేర్పరి యగు;
నరయ గంగాది మహానదుల్ సవతు లౌ
                        సెలయేఱులను వార్ధిఁ గలిపి నట్లు
పరగ మహాత్ములు భజమాను లరులైన
                        ననుకంప వారిఁ జేకొని భరింతు;


గీ.

రధికబలునకు నైన ఘోరారులందుఁ
దగ బలాత్కారదండంబు తడవు వలయు
సిద్ధి కగు; విమనీకృతాశేషమిత్ర
సమితి ఛందానువృత్తి దుస్సాధ్య మెందు.

222


క.

అరివధము వేల్పులకుఁ బ్రియ
కరమని తలఁచెదరొ మీరు? క్రతుభోక్తలు ని
ర్జరు లటు గావున వారికి
నరివధమున కన్న నిష్టమగు మఖ, మనఘా!

223


గీ.

అమృత మనఁగ యాజకులు త్రేతాగ్నులందు
విధియుతంబుగ నెయ్యది వేల్తు రదియె
మందరక్షుబ్ధమథితాబ్ధియందుఁ బొడమె
ననుట యది కీర్తిమాత్రంబె, యదువరేణ్య!

224


గీ.

రమణ! 'నీనందనుని యపరాధశతము
నటు సహించెద' ననుచు మీ రధికపూజ్య
యగు పితృష్వసతోడ మున్నన్నమాట
తలఁపు; మది తప్పి నడిచినఁ గలుష మొదవు.

225


సీ.

సురవరవినుత! సత్పురుషుని బుద్ధియు
                        వ్యాపారమును జిత్త మనవరతము
మిక్కిలి నిశిత మై మిగులఁ దేజోవంత
                        మై యభిమానోష్ణమై తనర్చు;
వైనను దీక్ష్ణశస్త్రాకృతిఁ బరమర్మ
                        భేదిని గాదు; ప్రస్ఫీతపంచ
వదనంబు కైవడిఁ బరహింస్రకము గాదు;
                        దహనునిమాడ్కి సంతాపి గాదు;


గీ.

వాగ్మియగు సత్యసంధుని వచన మేక
రూపమున నుండుఁ గాని వైరూప్య మొంద;
దీవు పైతృష్వ సేయుపై నెత్తి పోవ
వలదు; చనితేని దోసంబు వచ్చు, నీకు!

226


వ.

దేవా! పట్టపగలింటికి సూర్యుండునుం బోలె స్వయంకృతప్రసా
దుండగు చైద్యునివధంబుకొఱకు నియతకాలావసానంబు