Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బోలె నత్యంతవైచిత్రి గలిగి యుండు.

195


గీ.

స్వేచ్ఛచేత నసంగతం బెంతయును య
ధేష్టముగఁ బెక్కుతెఱఁగుల, నీరిత మగు
బంధురానుజ్ఝితార్థసంబంధ మగుత
తప్రబంధంబు భువి దురుదాహరంబు.

196


గీ.

అనఘచారిత్ర కదు మృదు, వయ్యు నతిఘ!
నం బనల్పకగుణకల్పనంబు చిత్ర
మైన వచనంబు నొగిఁ బట్టినట్ల కుశలు
రుర్విలో విస్తరింపఁజేయుదు రధీశ.

197


గీ.

అంబుజాక్ష సర్వజ్ఞుండ వైన నీదు
మ్రోల నీతిశాస్త్రము చెప్పఁబూను టెల్ల
నరయ నభ్యస్తశాస్త్రదార్ఢ్యంబు నందు
హేతువైన సమామ్నాయ మిది నిజంబు.

198


సీ.

ఉర్విలో మంత్రశక్త్యుత్సాహశక్తులు పెంపు గోరెడు నట్టి విజయశీలి
ప్రభుశక్తి కరయ మూలం బగుఁ గావునఁ బ్రీతి నారెంటి నార్జించుటకును
నరపతి మిగుల యత్నము సేయఁ దగు నయ మొప్ప నేధీరులు సోపధాన
సుస్థిరతరబుద్ధి సొరిది ఖట్వమును గాఁ దెలియుదు రమ్మహాధీరవర్యు


గీ.

లట్టి ధీఖట్వమం దొగి, ననవరతము
తప్ప కనిషణ్ణు లగుచు నొకప్పుడైన
ఖేద మెఱుఁగక సుఖియింతు రాదరమున
వారి కఖిలార్థములును జేకుఱు ననఘ.

199


క.

శితమతులు శరముక్రియ వి
శ్రుతముగ సూక్ష్మముగఁ దాఁకి లోపలనేఁచు
క్షితి మందబుద్ధు లుపలా
కృతిఁ గడుస్థూలముగ సోఁకి, యెసఁగు వెలుపలన్.

200


గీ.

అజ్ఞు లల్పకార్య మారంభ మొనరించి
వ్యగ్రు లగుచుఁ చార మంద లేరు
ప్రాజ్ఞు లధికకార్యపరు లయి మిగుల న
వ్యగ్రు లగుచుఁ చార మందఁగలరు.

201


వ.

మఱియు నిద్రాళుండగు మృగయుం డాత్మగుప్తిస్థానం బైన గర్తంబున
నుండియు మృగంబుల వధింపంజాలనిచందంబున నుపాయంబునఁ
గార్యకరణోద్యుక్తుం డయ్యును బ్రమాదంబు నొందినవాని యర్థంబు