Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శూన్యం బైన డిద్ధాది శబ్దంబు కరణిఁ గేవలసంజ్ఞార్థం బై
యుండు; మఱియును.

174


చ.

ఘనగిరి కున్నతత్వ మది గల్గు నగాధత లేదు; వార్ధికిం
గనుఁగొనఁగా నగాధతయుఁ గల్గు సమున్నతి లేదు; ధాత్రిలో
ఘనత మనస్వివర్యునకుఁ గల్గును రెండును; గాన ధీరుఁడున్
గొనకొని వాని కన్న నధికుండయి యొప్పుఁ దలంచి చూడఁగన్.

175


గీ.

రాహు వెప్పుడు తుల్యాపరాధులైన
భానుమంతునిఁ దడవుగాఁ బట్టి మ్రింగు
సారెసారెకుఁ గబళించు శశకధరుని
మ్రదిమ గల్గుట కుర్విలో నిది ఫలంబు.

176


గీ.

అల్పరిపుమారుతము వ్యాప్త మగుచునుండఁ
బరగ నిష్పౌరుషుం డైన నరుఁడు తృణము
మాడ్కిఁ దన యంతఁ దానె నమ్రత వహించు;
నవని దుర్బలురకును దృష్టాంత మిదియ.

177


గీ.

మఱియుఁ దేజస్వి తేజస్వి మధ్యమందు
గరిమతో దూరగతుఁ డయ్యు గణుతి కెక్కు;
మానితంబుగఁ బంచాగ్ని మధ్యమందుఁ
దపము గావించు తపసికిఁ దపనుఁ డరయఁ
బంచమవిభావసుండయి పరగునట్లు.

178


గీ.

విమతుల శిరములపైఁ బా
దము మెట్టక పుడమిఁ గీర్తిధనుని సమాఖ్యా
రమణి నిరాలంబంబుగఁ
బ్రమదంబున నెట్లు త్రిదివపథమున కెక్కున్?

179


క.

మృగమును దొడపై నిడుకొని
మృగాంకుఁ డనఁ బరగె విధుఁడు; మృగముల నెల్లన్
దెగఁ గొనుటఁ జేసి కేసరి
మృగరాజని బిరుదు గాంచె మేదినియందున్.

180


సీ.

దండసాధ్యుం డైన దండిశాత్రవునందుఁ
                        గరము సామం బపకార మగును;
బరగ స్వేదోచితాపక్వజ్వరము వారి
                        సేచనంబున వృద్ధిఁ జెందుఁగాదె?
యగ్నిచే సంతప్త మైన ఘృతంబుపైఁ
                        గాండముల్ జల్లిన మండి నట్లు
సక్రోధుఁడైన యా చైద్యున కటు సాంత్వ
                        వచనంబు లధికదీపన మొసంగు;