మఱియు నుపకారాపకారమంబులలోన నెద్ది యేనియు నొక
క్రియచేత నిర్వృత్తులైన కృత్రిమమిత్రుండుకు గృత్రిమశత్రుం
డును యావజ్జీవపర్యంతంబు నేకస్వభావంబున నుందురు గావున
వారు బలవంతులై యుందురు వార లుపకారాపకారకార్యవశం
బువలన నిర్వృత్తులై యుందురు; సహజప్రాకృతు లట్టివారు గా
రెట్లనిన: - ఏకశరీరావయవవంతులైన మాతృష్వసేయపితృష్వ
సేయాదులు సహజమిత్రులు; పితృవ్యతత్పుత్రాదులు సహజ
శత్రువులు; ప్రాకృతుండు పూర్వోక్తకృత్రిమసహజలక్షణరహి
తుండును విషయానంతరుం డైన రాజు ప్రాకృతశత్రుండు;
తదనంతరుం డైన రాజు ప్రాకృతమిత్రుఁ డగు; నాసహజ
ప్రాకృతశత్రుమిత్రులు తాదాత్మ్యకార్యవశంబు వలన నియ
మంబు లేక యుభయరూపత్వంబు నొందుదు రుపకారు లై రేని
సహజప్రాకృతశత్రువులతోడ నైన సంధి సేయందగు; నపకారు
లై రేని సహజప్రాకృతమిత్రులతోడ నైన సంధి సేయం దగ
దుపకారాపకారంబులు శత్రుమిత్రులకు లక్షణం బని తెలియం
దగినయది; సాక్షాచ్ఛత్రునితో సంధియు మిత్రునితో విరోధం
బెట్లు గావింపవచ్చు నంటి రేని యది కార్యవైపరీత్యంబు వలన
దోషంబు గాదు; కావున సహజమిత్రత్వంబునందును శిశుపా
లుడు కార్యంబుచేత శత్రుండు; గావున వాఁ డవశ్యంబు
హంతవ్యుండు.