Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.⁠

మామకసోదరిన్ సకలమంగళగేహినిగా నొసంగితిన్
మామఱిఁదిన్ శిరఃకుసుమమంజరిఁ జేసితి నింకనైన నీ
పాములవేసమున్ విడువు భావుక యంచిటు మేలమాడు మా
స్వామి మృదూక్తికిన్ నగుచు భాసిలు శూలి కృతీంద్రుఁ బ్రోవుతన్.

⁠ 4


మ.⁠

నను ము న్నొల్ల నటంచుఁ బల్కి పిదప న్మాతండ్రినిన్ దల్లి నొ
య్యనఁ బ్రార్థించి వివాహమై కరుణ నర్ధాంగంబు నా కిచ్చితో
యనఘా యీ ఘనమోహ మెం దరిగె నాఁ డంచిట్లు మేలంబు లా
డునగేంద్రాత్మజ మత్కృతీశు నృపచంద్రుం బ్రోచు నెల్లప్పుడున్.

⁠


సీ.⁠

పచ్చవిల్తునితండ్రి బలుబొడ్డుతమ్మిపై
                        లీలనాడెడు ముద్దుబాలకుండు
విసువక యేప్రొద్దు వింతబొమ్మలఁ జేసి
                        చతురత నాడించు జంత్రగాఁడు
వాగ్దేవి నెప్పుడు వదలక తనజిహ్వ
                        మీఁద ధరించిన మేటిమగఁడు
సనకాదియోగులు చారుశ్రుత్యుక్తుల
                        వినుతింపఁ దలయూఁచు వేడ్కకాఁడు

⁠


గీ.⁠

ధాత భువనైకకుశలసంధాత లోక
తాత సర్వక్రియాచారతత్రివిధాత
యెలమి గోపాలకృష్ణయాచేంద్రవిభునిఁ
జెలఁగి దీర్ఘాయు వొసఁగి రక్షించుఁగాత.

⁠ 6


చ.⁠

తనపతిజిహ్వికాగ్రమునఁ దప్పక నిల్చి విపంచి మీటుచున్
ఘనముగ వర్ణరూపమును గైకొని ప్రీతి సమస్తవేదముల్
పనివడి సర్వశాస్త్రములు భర్తృముఖంబునఁ బల్కరించు శో
భనసుచరిత్ర భారతి కృపాకలనం గృతినాథుఁ బ్రోవుతన్.

⁠


చ.⁠

అరయ నభేదరూపధరులౌ తలిదండ్రులమోల బాల్యమం
దురమున నొక్కవంకఁ గుచ మొక్కయెడన్ ఫణినాథహారమున్
బరువడిఁ జూచి మౌగ్ధ్యమున భవ్యకపిత్థామృణాళశంకచేఁ
గరమటు సాఁచు విఘ్నపతిఁ గావుత సత్కృతినాథు నిత్యమున్.

⁠ 8


సీ.⁠

రామాయణాఖ్యమహామృదుకావ్యసు
                        ధారసాంభోధి యేధన్యురసన
యఖిలపురాణేతిహాసకథామూల్య
                        మణిగణపేటి యేమౌనికుక్షి

⁠