Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గప్పిన కిన్కచే నిశితకాండములన్ వధియించి పుచ్చవే!
యిప్పుడు, తచ్చరిత్రము నహీనమతిం దలపోయు, మచ్యుతా!

131


వ.

మహాత్మా! పరప్రతారణపరుండైన యా రావణుం డిప్పుడు
శైలూషుండు రూపాంతరంబునుం బోలె భవాంతరంబు నొంది
శిశుపాలుం డనుసంజ్ఞచేతఁ దిరోహితాత్ముం డై యన్యులచేత
నతండె యితండని యెఱుంగంబడక వర్తింపుచున్నవాఁ డా శిశు
పాలుండు బాల్యంబున భుజచతుష్టయవంతుం డై ముఖంబుచేతఁ
బూర్ణచంద్రప్రతిముండై లోచనత్రయోపేతుం డై యుండు
నిప్పు డవి యన్నియు నంతర్హితంబు లగుటం జేసి తరుణుం డై
కరాక్రాంతమహీభృద్వరుం డై యత్యున్నతతేజంబున సాక్షా
త్సూర్యుండై వెలుంగుచున్నవాఁ డదియునుంగాక.

132


చ.

ˈకడిమియదృచ్ఛచే నమరకర్బురకోటి ననుగ్రహింపఁగాఁ
గడువడి నిగ్రహించుటకుఁ గర్తను నేనె' యఁటంచు గర్వి యై
తడయక ధాతృముఖ్యసురదత్తవరంబున వీర్యసంపదల్
వడసిన రావణాదులను వాఁడు హసింపుచునుండు నిచ్చలున్.

133


చ.

పరగ జిగీషుఁ డైన శిశుపాలునిచేత బలావలేపతన్
దురుసుగ నిప్పుడున్ జగము తొంటివిధంబున గాసి నొందెడున్;
వరసతి యైన కాంత వలె వారక సుస్థిర మౌ స్వభావమున్
ధరఁ బ్రతిజన్మమం దవి తథంబుగఁ బూరుషు నొందునే కదా!

134


గీ.

అ ట్లతిక్రాంతదైవాజ్ఞుఁడైన వాని
యమనికేతనాతిథిని గా ననుపు మీవు!
పృథిని కటు పీడ సేయు శుభేతరప్ర
చారుల వధించు ఓది సాధుసమ్మతంబు.

135


గీ.

అరివధముచేత ధృతదార్ఢ్య మైనశత్రు
చిత్త మతిసాంద్రపులకశచీకుచాగ్ర
ధృతపరీరంభపీడనోన్నతసహత్వ
మొందుఁ గా కిటు మరల నస్పంద మగుచు.

136


వ.

అని యిట్లు విన్నవించి సురమునియగు నారదుం డాకాశం
బున కుద్గమించి చంద్రునికాంతి వహింపుచుండ నప్పుడు చేది
దేశాధీశ్వరుండైన శిశుపాలునియం దతిక్రుద్ధుండైన చక్రపాణి