ఇది శ్రీరామచంద్రకరుణాకటాక్షలబ్ధవిద్యాసాంద్ర
గోపినాథ వేంకటకవీంద్రప్రణీతంబైన శిశుపాల
వధ మహాకావ్యంబునందు శిశుపాలుండు దూతనొ
క్కని సంగ్రామంబుకొఱకుఁ బిలిచి రమ్మని శ్రీకృష్ణుని
పాలికిఁ బనుచుటయుఁ దదీయదురాలాపంబులును బ
లభద్రసాత్యకిప్రద్యుమ్నాదియాదవులకోపంబును
సర్వసైన్యసమేతంబుగాఁ గృష్ణుండు యుద్ధార్థంబు శి
శుపాలునిమీఁదికిం జనుటయు శిశుపాలసహచర
రాజుల కపశకునంబు లగుటయు యుద్ధప్రారంభంబు
ను సంకులయుద్ధంబును ద్వంద్వయుద్ధంబు నుభయసై
న్యంబులందుఁ గలరథికాశ్వికగజారోహకులపరస్ప
రయుద్ధంబును బలరామునిపరాక్రమంబును బ్రద్యు
మ్నునివిక్రమవిశేషంబును శిశుపాలసైన్యహరణం
బును గృష్ణశిశుపాలుర ద్వంద్వయుద్ధంబును దివ్యా
స్త్రప్రయోగంబును హరిచక్రధారాఖండితకంఠుం
డై శిశుపాలుండు మృతుం డగుటయుఁ గృష్ణుండు