Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జేయుచు వృషంబుభంగి గర్జింపుచును ఘ
నంబు వర్షించె నదులు పూర్ణంబు గాఁగ.

222


వ.

ఇత్తెఱంగున నప్పవమానసఖుండు ప్రియంబులైనను వివాద
వాక్యంబులచేతఁ బ్రణయప్రయుక్తకోపంబుభంగి ననుద్దీపక
మేఘోద్భవసలిలంబులచేత మొదల వైపరీత్యంబున మిక్కిలిఁ
బ్రజ్వలించి పదంపడి క్రమంబుగా శాంతుండయ్యె నంత.

223


గీ.

నీరసేకంబుచే బలాత్కారమున స
మగ్రముగ నీయమానుఁడై యాశ్రయాశుఁ
డపుడు ప్రబలమేఘంబులయందు సాంద్ర
చంచలావ్యాజమునఁ బ్రవేశం బొనర్చె.

224


సీ.

ప్రశమంబునొందిన పావకసంబంధి
                        సంత్యక్తమూలవిశాలహేతి
హరహయముక్తవజ్రాభిఘాతంబున
                        విచ్ఛిన్న మగు పక్షివిభుని యేక
పక్షంబుగతిఁ జూడఁబడియె నొక్కట ఘనా
                        ఘనసమూహంబు లగ్నిని శమింపఁ
జేసి శీఘ్రంబునఁ జెలఁగి దిశాముఖం
                        బులనుండి జాఱె సంచలత నొంది


గీ.

యరయ నది యుక్తమే కదా! యధికు లెందుఁ
బరుల కుపకార మొనరించి ప్రాభవమున
నొనర నుపరోధ మొనరింప రుర్విలోన
నిది స్వభావ మైయుండు మహాత్ములకును.

225


గీ.

కృష్ణవర్త్మశిఖలఁ గృతతాపమై నవ
జీవనమున మిగుల సిక్త మగుచు
నపగతాభ్రదోష మగుమిన్ను తాపిత
పాయితాసి లతికభంగి నొప్పె.

226


వ.

ఇట్లు పావకాస్త్రంబు వితథంబైన క్షిప్రకారి యగుశిశుపా
లుండు కుపితుండై రోగం బుపద్రవాంతరంబునుం బోలె
నేయేయస్త్రంబు బ్రయోగించె నవియన్నియుఁ బరిపాటివేది
యైనకృష్ణుండు వైద్యుండునుంబోలె మహానర్ధప్రతిపాదకంబును